Mon Dec 23 2024 06:46:14 GMT+0000 (Coordinated Universal Time)
Nov 27th to Dec 3rd Horoscope : నేటి పంచాగం, ద్వాదశ రాశుల వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు, ఆదాయం సమానంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు శ్రమ పెరుగుతుంది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, ఆదివారం
తిథి : శు.చవితి సా.4.25 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ మ.12.38 వరకు
వర్జ్యం : రా.7.55 నుండి 9.23 వరకు
దుర్ముహూర్తం : మ.4.00 నుండి 4.44 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.20 నుండి 9.20
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు వక్రగతిలో
తుల - కేతువు
వృశ్చికం - రవి, బుధుడు, శుక్రుడు
మకరం - శని
మీనం - గురువు
చంద్రగ్రహ సంచారం
ధనస్సు, మకరం, కుభం, మీనం
నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో తరచూ వివాదాలు చోటుచేసుకుంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. అవమానాలు ఎదురవుతాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు - ఆదాయం సమానంగా ఉంటాయి. వ్యాపార పరమైన చర్చలు ఫలిస్తాయి. ప్రేమలు విఫలమవ్వొచ్చు. రెండో పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దంపతుల మధ్య తగాదాలు పెరుగుతాయి. పనుల్లో కష్టం పెరుగుతుంది. ఈ వారం బుధ,గురు,శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉంటే విజయం వరిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. స్థలానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంఘ గౌరవం పెరుగుతుంది. ఒత్తిడి తట్టుకోలేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు, ఆదాయం సమానంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు శ్రమ పెరుగుతుంది. మానసిక, శారీరక అలసట పెరుగుతుంది. దంపతుల మధ్య బంధం తగ్గుతుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపార విస్తరణకు సానుకూలం కాదు. ఈ వారం సోమ, మంగళవారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినవి సానుకూలంగా సాగుతాయి. అనవసరమైన వివాదాలు ఎదురైనా.. పట్టించుకోకపోవడం మంచిది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. నూతన కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ వారం ఆది,సోమ,మంగళ,బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూలమైన ఫలితాలుంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సేవింగ్స్ పై దృష్టి సారిస్తారు. శుభకార్యాలు ఫలిస్తాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం బుధ,గురు,శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు సజావుగా సాగుతున్నా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జరిగిన సంఘటనలు, పాతపరిచయాలను గుర్తుచేసుకుని బాధపడుతుంటాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. నూతన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. కోపం, ఆవేశం వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవచ్చు. శారీరక అలసట పెరుగుతుంది. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. లచ్మీ కవచ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కష్టేఫలి అనే సూత్రాన్ని నమ్ముకుంటారు. అదృష్టం కలిసిరాకపోవచ్చు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉత్సాహం కలిగి ఉంటాయి. ఇల్లు మారే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులుండవు కానీ.. వాహన ప్రమాద సూచన ఉంది. కీలక నిర్ణయాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ స్తోత్రం, శివకవచ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంది. కీలక నిర్ణయాలకు అనుకూలం. శుభ కార్యాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగ మార్పుల్లో నిర్ణయాలు కలసివస్తాయి. చిక్కుప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. స్వయంకృతాపరాధం మినహా.. ఎక్కడా ఇబ్బందులుండవు. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కోర్టు కేసులు ముందంజలో ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్న ఉపకరిస్తాయి. ఆపరేషన్ వంటి విషయాల్లో ముందుకు వెళ్లడం మంచిది. అపార్థాలకు తావివ్వొద్దు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం రిస్క్ తో కూడిన కార్యక్రమాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక విషయాలు చూచాయిగా ఉంటాయి. రావాల్సిన ధనం సకాలంలో అందదు. ఉద్యోగమార్పులు మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ సుబ్రమణ్య అష్టకాన్ని పఠించడం మంచిది.
Next Story