Sat Dec 28 2024 18:21:37 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 29 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, మంగళవారం
తిథి : శు.షష్ఠి మ.11.04 వరకు,
నక్షత్రం : శ్రవణం ఉ.8.39 వరకు
వర్జ్యం : మ.12.14 నుండి 1.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.36 నుండి 9.20 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : సా.4.45 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ మంచి తనాన్ని అలుసుగా తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనిలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. క్రయవిక్రయాలకు దూరంగా ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. వైద్యుల సలహాలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఊహించని వ్యక్తుల నుండి సహాయం పొందుతారు. దంపతుల మధ్య తగాదాలు, గొడవలు కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనివేళలు, ఒత్తిడులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహనయోగం ఉండొచ్చు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చవ్వొచ్చు. ఎదుటివారిని అంచనా వేయడంలో విఫలమవ్వొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నా.. కలసివస్తుంది. ఎదుటివారికి సహాయం చేసి ఆత్మసంతృప్తి పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి మాట్లాడటం అవసరం. ప్రయాణాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. సొంత వ్యాపారస్తులకు వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎక్కువగా ఆలోచించి.. తక్కువ పనిచేస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. జరిగిపోయిన సంఘటనలు పదేపదే గుర్తొస్తాయి. లో ఫీవర్ వంటివి బాధించవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కు.. ఫలితం తక్కువగా ఉంటుంది. వస్తువుల కొనుగోళ్లలో నష్టపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువ. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఆనందంగా గడుపుతారు. ఆఫర్ లెటర్లు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story