Mon Dec 23 2024 07:02:37 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 7 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతి
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, సోమవారం
తిథి : శు.చతుర్దశి సా.4.15 వరకు
నక్షత్రం : అశ్వని రా.12.37 వరకు
వర్జ్యం : రా.8.32 నుండి 10.10 వరకు
దుర్ముహూర్తం : మ.12.14 నుండి 12.59 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : మ.3.30 నుండి 4.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలుంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికతతో ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. సహాయ సహకారాలు అందుతాయి. పుణ్యతీర్థాలను సందర్శిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమయాలు పెరుగుతాయి. నిద్రాహారాలు లోపిస్తాయి. పూర్తిచేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తవవు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దేనిపైనా శ్రద్ధ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక భావజాలంతో ఉంటారు. దానధర్మాలు చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. లావాదేవీల్లో మంచి ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్నవారితోనే తగాదాలు ఏర్పడుతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు మార్పులు చేర్పులు చేయడం మంచిది కాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. నిరుత్సాహం తప్పదు. అప్పులు చేసే సూచనలున్నాయి. అపార్థాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. వీలైనంత వరకూ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story