Wed Jan 01 2025 05:00:42 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 9 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పని తలపెట్టినా ఇబ్బందులు ఏర్పడుతాయి. బంధువులతో విబేధాలు పెరుగుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బుధవారం
తిథి : బ.పాడ్యమి సా.5.16 వరకు
నక్షత్రం : కృత్తిక తె.3.09 వరకు
వర్జ్యం : మ.2.24 నుండి 4.06 వరకు
దుర్ముహూర్తం : మ.11.28 నుండి 12.14 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : మ.9.25 నుండి 10.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చర్చల్లో అనుకూల ఫలితాలుంటాయి. రిజిస్ట్రేషన్లు సానుకూలంగా కొనసాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం కలుగుతుంది. బంధువులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడవచ్చు. పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువగా ఉంటుంది. మధ్యవర్తిత్వం, ఉచిత సలహాలు వంటి వాటివల్ల నష్టాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎలాంటి మార్పు ఉండవు. అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. వస్తువులు కనిపించక ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మెరుగైన ఫలితాలుంటాయి. లాభాలు పెరుగుతాయి. ఫైనాన్స్, కాంట్రాక్ట్ రంగాల వారికి కాలం కలసివస్తుంది. సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. పనుల్లో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అర్థం చేసుకునేవారు లేక మనస్తాపం చెందుతారు. నూతన వ్యాపారాలపై పునరాలోచన చేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పని తలపెట్టినా ఇబ్బందులు ఏర్పడుతాయి. బంధువులతో విబేధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కీలక నిర్ణయాలేవీ తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టుకేసులపై దృష్టిసారిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. బ్యాంకు రుణాలు అందుతాయి. అప్పులు తీరుతాయి. సలహాలను పక్కనపెట్టి మీ తోచిన దారిలోనే వెళ్లడం వల్ల మంచి జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. తొందరపాటు తగదు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ముఖ్యంగా ఈ రోజు ఆర్థికంగా ఊరట కలుగుతుంది. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులు యోగిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలిసొచ్చే కాలం. దీర్ఘకాలిక అనారోగ్యాలకు పరిష్కారం లభిస్తుంది. పెట్టుబడులు, పొదుపులు, క్రయవిక్రయాలకు సంబంధించిన విషయాలు యోగదాయకంగా ఉన్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story