Mon Jan 06 2025 04:59:16 GMT+0000 (Coordinated Universal Time)
October 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, శుభ సమయాలు : సా.4.15 నుండి 5.15 వరకు
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.చవితి తె.3.08 వరకు
నక్షత్రం : కృత్తిక సా.6.41 వరకు
వర్జ్యం : ఉ.7.38 వరకు
దుర్ముహూర్తం : ఉ.9.57 నుండి 10.43 వరకు
మ.2.37 నుండి 3.24 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.15 నుండి 5.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికమవుతాయి. తగాదాలు తప్పవు. మాట పట్టింపులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమరంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీడెంచి మేలు ఎంచాలన్న చందంగా ఆలోచిస్తారు. ఫైనాన్స్ రంగాలకు అనుకూలం. ముక్కుసూటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగుతాయి. ఈరోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలసట పెరుగుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. అప్పులివడం, తీసుకోవడం మంచిది కాదు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలం. భార్య- భర్తల మధ్య తగాదాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులవుతారు. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యానికి మంచి వైద్యం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్నినిర్ణయాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ధర్మాన్ని నమ్ముతారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. పెద్దవారితో తగాదాలు వచ్చే అవకాశాలున్నాయి. పనులు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధిగమవుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా-బయట గౌరవం పెరుగుతుంది. ప్రతివిషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టి సారిస్తారు. అనుభవజ్ఞుల సలహాలను తీసుకుంటారు. అనుకున్న పనిని పూర్తిచేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విభేదాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వీలైనంత వరకూ తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంతంతమాత్ర ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ నమ్మకపోవడం మంచిది. పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు రంగులు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా ఆలోచిస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్యాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ.
Next Story