Mon Jan 06 2025 04:19:47 GMT+0000 (Coordinated Universal Time)
October 14 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
తిథి : బ.పంచమి తె.4.52 వరకు, నక్షత్రం : రోహిణి రా.8.47 వరకు, వర్జ్యం : మ.12.05 నుండి 1.50 వరకు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.పంచమి తె.4.52 వరకు
నక్షత్రం : రోహిణి రా.8.47 వరకు
వర్జ్యం : మ.12.05 నుండి 1.50 వరకు
రా.2.59నుండి 4.46 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.10 వరకు
రా.12.17 నుండి 1.03 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : సా.5.15 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అప్పులకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోవాలి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాలు, మాటపట్టింపులు ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈరోజు ధరించకూడని రంగు తెలుపురంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కీడెంచి మేలు ఎంచాలన్న చందంగా ఆలోచిస్తారు. రుణప్రయత్నాలు కలసివస్తాయి. నేర్పుగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపురంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన ఖర్చులుంటాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అంచనాలు తారుమారవుతాయి. తప్పనిసరి పనులు మాత్రమే చేయడం మంచిది. ఈరోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. వైద్యానికి సంబంధించిన విషయాలు సానుకూలం. శుభవార్తలు వింటారు. చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీరంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒత్తిడి అధికం. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. ఎదుటివారికి సలహాలిస్తారు. ఆర్థిక స్థితి గతులు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన వివాదాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి అధికం. ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఏ పని చేయాలన్నా వాయిదా పడుతుంది. అనవరమైన విషయాలకు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపురంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ఇంటా- బయట మాట చెల్లుతుంది. భార్య-భర్తల మధ్య తగాదాలు తప్పవు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బంధువులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆర్థిక ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగస్తులు మార్పు కోరుకోకపోవడం మంచిది. ఈరోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతాయి. నూతన పరిచయాలుంటాయి. విద్యార్థినీ, విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కష్టం తప్పదు. పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. శత్రుబలం తగ్గుతుంది. కోర్టుకేసులు కలసివస్తాయి. ఈరోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story