Sat Jan 04 2025 01:31:57 GMT+0000 (Coordinated Universal Time)
October 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పని తగాదాలతో కూడుకుని ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.సప్తమి ఉ.9.29 వరకు
నక్షత్రం : పునర్వసు తె.5.13 వరకు
వర్జ్యం : మ.3.44 నుండి 5.31 వరకు
దుర్ముహూర్తం : మ.12.16 నుండి 1.02 వరకు
మ.2.35 నుండి 3.22 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.30 నుండి 6.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు యోగదాయకంగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఒత్తిడులు సహజం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయరంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలుంటాయి. వృథా ప్రయాస తప్పదు. కొన్నిరంగాల్లో వారికి వివాదాలు ఎదురవుతాయి. ఈరోజు ధరించకూడని రంగు తెలుపురంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనారోగ్యం రావొచ్చు. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈరోజు వృథా ఖర్చులుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా నిదానంగా సాగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోర్టు కేసులు సానుకూలంగా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. మొండి బాకీలు వసూలవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులుండవు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. అపార్థాలు ఏర్పడుతాయి. ప్రతి విషయంలో చికాకులుంటాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు తమ పని తాము చేసుకోవడం మంచిది. ఈరోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు కష్టతరంగా ఉంటాయి. ఊహించని ఖర్చులుంటాయి. చేయని తప్పుకి సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుంది. భార్య-భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉండొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. అధికారుల మెప్పు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బాకీలు వసూలవుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కొత్త పరిచయాలుంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పని తగాదాలతో కూడుకుని ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ప్రతి పనిని వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విస్తారంగా ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగవచ్చు. నిదానమే ప్రధానమన్న చందంగా ఉండాలి. తప్పనిసరి పనులు మినహా మిగతా పనులు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story