Sat Jan 04 2025 01:17:53 GMT+0000 (Coordinated Universal Time)
October 18 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాలు సానుకూలంగా కొనసాగుతుంది. దంపతుల మధ్య..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.అష్టమి మ.11.57 వరకు
నక్షత్రం : పుష్యమి పూర్తిగా
వర్జ్యం : మ.2.09 నుండి 3.56 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.10 వరకు
రా.10.38 నుండి 11.28 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.20 నుండి 1.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తి కావు. వాయిదా వేసుకోవడం మంచిది. వినోద కార్యక్రమాలపైకి మనస్సు మళ్లుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. అన్నిరంగాల వారికి అనుకూలంగా ఉంది. శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట పట్టింపులు ఏర్పడుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు అంతంతమాత్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. అనవసరమైన వివాదాలు చోటుచోసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మాట పట్టింపులు అధికమవుతాయి. విభేదాలు తప్పకపోవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్దరికంగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన గృహం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈరోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. అనుకున్నది ఒకటి.. జరిగేది మరొకటిగా ఉంటుంది. అనారోగ్యం ఉండవచ్చు. బంధువులతో వివాదాలుంటాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. వృత్తి- ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఈ రోజు ఆనందంగా కాలం గడుస్తుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకి సాగుతారు. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. ఇతరులకు సలహాలిస్తారు. ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్త పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు-విభేదాలతో సాగుతుంది. మంచిచెప్పినా.. చెడుగా అర్థమవుతుంది. అన్నివిధాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆరోగ్యం పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. పనులు వాయిదా పడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఏ పనీ పూర్తి కాదు. నష్టాలు రావొచ్చు. వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలి. పనులు వాయిదా వేసుకోవడం మంచిది. శత్రబలం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాలు సానుకూలంగా కొనసాగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలం. వాహన యోగం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. ఆనందంగా గడుపుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. లౌక్యంగా వ్యవహరిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు చేపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థినీ, విద్యార్థులు శ్రమించాలి. ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story