Sat Jan 04 2025 01:19:34 GMT+0000 (Coordinated Universal Time)
October 19 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలకు సానుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం, బుధవారం
తిథి : బ.నవమి మ.2.13 వరకు
నక్షత్రం : పుష్యమి ఉ.8.02 వరకు
వర్జ్యం : రా.10.09నుండి 11.55 వరకు
దుర్ముహూర్తం : మ.11.29 నుండి 12.15 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.30 నుండి 10.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉద్యోగాలపై దృష్టి సారించాలి. సమయం వృథా అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ప్రమాదాలు జరగవచ్చు. వృత్తి- ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అపార్థాలు ఉంటాయి. తగాదాలు పెరుగుతాయి. ముఖ్యమైన వస్తువులు లేదా డాక్యుమెంట్లు మిస్ అవ్వొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన తగాదాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేస్తారు. సమయస్ఫూర్తి లోపిస్తుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. స్థల విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ మార్పులు చోటుచేసుకుంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన పనులు సానుకూలంగా సాగుతాయి. అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. మాట ఇచ్చిన వారు నిలబెట్టుకోరు. ఆర్థిక, ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనవరసమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభనష్టాలు సరిసమానంగా ఉంటాయి. అంచనాలు తారుమారవుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. పెట్టుబడులపై పునరాలోచన చేసుకోవాలి. పెద్దవారితో తగాదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలకు సానుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. వృత్తి- ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ ఫైల్స్ లో పురోగతి ఉంటుంది. చెల్లింపులు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంతమౌనంగా ఉంటే అంత మంచిది. చిన్న చిన్న పొరపాట్లు పెద్దవి అవుతాయి. ఆర్థికంగా వృథా ఖర్చులుంటాయి. ఇంట్లో వారి సలహాలు, సూచనలు పాటించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story