Sat Dec 21 2024 14:38:24 GMT+0000 (Coordinated Universal Time)
నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి
కొత్తగా ఏ పని చేయాలన్నా మంచి, చెడులను చూస్తారు. మరి ఈ రోజు అనగా అక్టోబర్ 1, శనివారం మీ రాశిఫలం..
ఉదయం లేవగానే.. ఈరోజు ఎలా ఉంటుందో ? ఏ పని చేస్తే ఎలా కలిసొస్తుందో ? అని చాలా మంది ఆలోచిస్తారు. కొత్తగా ఏ పని చేయాలన్నా మంచి, చెడులను చూస్తారు. మరి ఈ రోజు అనగా అక్టోబర్ 1, శనివారం మీ రాశిఫలం ఎలా ఉంది ? ఏ పనులు చేయొచ్చు, ఏయే పనులు చేయకూడదు ? ఏ రంగు దుస్తులు ధరించకూడదు ? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : శు.షష్ఠి రా.8.46 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ తె.3.11 వరకు
వర్జ్యం : ఉ.9.39 నుండి 11.11 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.01 నుండి 7.36 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిని స్వయంగా చేసుకునేందుకు ప్రయత్నించడం మంచిది. నేడు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు క్రయ, విక్రయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నేడు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం మధ్యస్థ ఫలితాలుంటాయి. నేడు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటకం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సాధారణ ఫలితాలుంటాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో రహస్యాలను పాటించడం మంచిది. పనులు వాయిదా వేయడం మంచిది కాదు. నేడు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు క్రయ, విక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు ధరించకూడని రంగు తెలుపురంగు.
కన్యారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సేవింగ్స్ పై దృష్టిసారించడం మంచిది. పెద్దలతో, అన్నదమ్ములతో ఉన్న తగాదాలను రూపుమాపుకునేందుకు అనుకూలం. నేడు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సాధారణ ఫలితాలుంటాయి. ఆహారలోపంతో నీరసం అధికంగా ఉంటుంది. తప్పనిసరిగా చేయాల్సిన పనులు మాత్రమే చేయడం మంచిది. నేడు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు అనుకూలమైన ఫలితాలుంటాయి. కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. నేడు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకు, వైద్య వృత్తుల్లో ఉన్నవారు జాగ్రత్త పాటించడం మంచిది. నేడు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ, వృత్తి, ఆరోగ్య పరంగా బాగుంటుంది. నేడు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. శత్రబలం తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నేడు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు పనులు వాయిదా పడుతుంటాయి. ఆశలు నిరాశలవుతాయి. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. నేడు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story