Sat Jan 04 2025 01:42:59 GMT+0000 (Coordinated Universal Time)
October 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు స్థిరంగా ఉంటాయి. తగాదాలు- వివాదాలకు దూరంగా ఉంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం, బుధవారం
తిథి : బ.దశమి సా.4.04 వరకు
నక్షత్రం : ఆశ్లేష ఉ.10.30 వరకు
వర్జ్యం : రా.11.29 నుండి 1.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.9.56 నుండి 10.43 వరకు
మ.2.34 నుండి 3.21 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.3.15 నుండి 4.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతాయి. రిజిస్ట్రేషన్ల గురించి పునరాలోచన చేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. చర్చలు కలిసివస్తాయి. డబ్బును పొదుపు చేస్తారు. క్రయ విక్రయాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. చికాకులు పెరుగుతాయి. మధ్యవర్తిత్వం వహించకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా.. ఉపయోగకరమైనవే ఉంటాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అధికారులతో ఉన్న స్పర్థలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రుబలం తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు కలసివస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది. సంతానం గురించి చింత పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు స్థిరంగా ఉంటాయి. తగాదాలు- వివాదాలకు దూరంగా ఉంటారు. మంచినిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాలకు అనుకూలం. శత్రుబలం తగ్గుతుంది. ఆర్థిక ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. శుభకార్యాలు వాయిదా పడతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మాట ఇవ్వకపోవడం మంచిది. అధికారుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలకు సానుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. వ్యాపార చర్చలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. భార్యభర్తల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్యాల విషయంలో తొందరపాటు తగదు. ఉత్సాహం లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story