Sat Jan 04 2025 01:28:16 GMT+0000 (Coordinated Universal Time)
October 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా సాగుతాయి. ఎదుటివారి సలహాలు, సూచనలు తీసుకుంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం, శుక్రవారం
తిథి : బ.ఏకాదశి సా.5.22 వరకు
నక్షత్రం : మఖ మ.12.28 వరకు
వర్జ్యం : రా.8.56 నుండి 10.37 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.24 నుండి 9.10 వరకు
రా.12.15 నుండి 1.01 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.12.20 నుండి 1.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు-వివాదాలతో చిరాకుగా ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతాయి. నూతన వస్తు, వాహనాలను కొనే ప్రయత్నం చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అపార్థాలు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామితో తగాదాలుంటాయి. పనులు మొక్కుబడిగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, చర్చలు కలిసివస్తాయి. శుభకార్యాలపై దృష్టి పెడతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలు ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ప్రయాణాలుంటాయి. శుభవార్తలు వింటారు. పాతవిషయాలు ఆనందాన్నిస్తాయి. అన్ని రంగాల్లో ఉన్నవారికి సానుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో అలసటగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా చికాకుగా ఉంటుంది. పనులు వాయిదా పడుతుంటాయి. నూతన పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి- ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. అంచనాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానందా సాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు శ్రమించాలి. పనుల్లో జాప్యం ఉంటుంది. ఏ విషయంపైనా సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా సాగుతాయి. ఎదుటివారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా సాగుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. శత్రబలం పెరుగుతుంది. మాట పట్టింపులు వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. రుణ ప్రయత్నాలు కొనసాగుతాయి. వాహన మరమ్మతులు ఉంటాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story