Sat Jan 04 2025 01:47:17 GMT+0000 (Coordinated Universal Time)
October 22 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం, శనివారం
తిథి : బ.ద్వాదశి సా.6.02 వరకు
నక్షత్రం : పూర్వఫల్గుణి మ.1.50 వరకు
వర్జ్యం : రా.9.16 నుండి 10.55 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.05 నుండి 7.38 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాయిదా పనులపై దృష్టిసారిస్తారు. ఆర్థిక విషయాల్లో నేర్పుగా వ్యవహరిస్తారు. పెద్దల సలహాలు, సూచనలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. పనులు మొక్కుబడిగా సాగుతాయి. స్నేహితులు, పరిచయస్తులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సానుకూలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలు ఫలిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలను సొంతం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. గొంతు సంబంధిత సమస్యలు ఉంటాయి. దంపతుల మధ్య సఖ్యత తగ్గుతుంది. ప్రమాదాలు జరగవచ్చు. వాహన యోగం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చోటుచేసుకుంటాయి. ఆహ్లాదకరమైన విషయాలు వింటారు. పాత, కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాలి. విద్యార్థినీ విద్యార్థులు శ్రమించాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం లేదా గృహం కొనుగోళ్లలో నిర్ణయం తీసుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. అపోహలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. రాజకీయ రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాహాది శుభకార్యాలపై తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. వృత్తి-ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులుంటాయి. వాహన యోగం ఉంది. రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story