Sat Jan 04 2025 01:16:40 GMT+0000 (Coordinated Universal Time)
October 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. శుభకార్యాలు ఆటంకం..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బుధవారం
తిథి : శు.పాడ్యమి మ.2.42 వరకు
నక్షత్రం : స్వాతి మ.1.24 వరకు
వర్జ్యం : సా.6.43 నుండి 8.14 వరకు
దుర్ముహూర్తం : మ.11.28 నుండి 12.14 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు అనుకూలంగా ఉన్నాయి. చర్చలు ఫలిస్తాయి. వృత్తి-ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సమీకరణాలు కలసివస్తాయి. మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా పడుతుంటాయి.ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గతాన్ని తలుచుకుంటుంటారు. శత్రుబలం పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి మార్పు ఉండదు. ఉద్యోగస్తులు, వ్యాపారులు పనులు నిదానంగా సాగిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. అన్నింటిలోనూ చురుగ్గా పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ప్రతిపనిలోనూ నిరుత్సాహం తప్పవు. పరిచయాల వల్ల లాభం ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త అవకాశాలు కలసివస్తాయి. వ్యాపార రంగాలకు అనుకూలంగా ఉంది. లౌక్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభవార్త వింటారు. ప్రయాణాలు తప్పకపోవచ్చు. శారీరక, మానసిక శ్రమ ఎక్కువవుతుంది. తీసుకున్న నిర్ణయాలు, చేయాల్సిన పనులు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. శుభకార్యాలు ఆటంకం లేకుండా కొనసాగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కొత్తవిషయాలను తెలుసుకుంటారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఇంట-బయట ఒత్తిడి పెరుగుతుంది. అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొత్తవారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story