Sat Jan 04 2025 01:36:57 GMT+0000 (Coordinated Universal Time)
October 27 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి-ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, గురువారం
తిథి : శు.విదియ మ.12.45 వరకు
నక్షత్రం : విశాఖ మ.12.11 వరకు
వర్జ్యం : మ.3.56 నుండి సా.5.26 వరకు
దుర్ముహూర్తం : ఉ.9.56 నుండి 10.44 వరకు
మ.2.32 నుండి 3.18 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.10.55 నుండి 11.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. తగాదాలు, వివాదాలు చోటుచేసుకోవచ్చు. వృత్తి-ఉద్యోగాల్లో మార్పు ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి-ఉద్యోగాల పరంగా సానుకూల స్థితిగతులు ఉంటాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలసివస్తాయి. తగాదాలు తగ్గుతాయి. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబి రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. బెటర్ జాబ్స్ కు ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంది. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవరసమైన వివాదాలు చోటుచేసుకుంది. స్నేహితులు, బంధువులు అందుబాటులో ఉండరు. ఇంట, బయట ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. వాహన యోగం ఉంది. ఇతరులతో సంభాషణ తగ్గించుకుంటారు. పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంది. చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులు సానుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు (లైట్ కలర్స్).
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయ. ఆరోగ్యం మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎక్కువగా ఆలోచిస్తారు. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతిపనీ అతికష్టంగా పూర్తవుతుంది. పనుల్లో చికాకులుంటాయి. రిజిస్ట్రేషన్ పనులపై దృష్టిసారిస్తారు. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లు..అమ్మకాలకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి చేసే పనులు సక్సెస్ అవుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. వాహన యోగం ఉంది. అన్నిరంగాల వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి-ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. కోర్టుకేసులు అనుకూలంగా కొనసాగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు దేనిపైనా మనసు ఉండదు. తప్పనిసరి అని పనిచేస్తారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో పునరాలోచన చేయాలి. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story