Sun Dec 22 2024 16:40:25 GMT+0000 (Coordinated Universal Time)
JULY 6 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలం. ఆర్థికపరమైన విషయాల్లో 1 గంట తర్వాత..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, గురువారం
తిథి : బ.తదియ ఉ.6.30 వరకు, బ.చవితి రా.3.13 వరకు
నక్షత్రం : ధనిష్ఠ రా.12.26 వరకు
వర్జ్యం : ఉ.6.31 నుండి 7.57 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.10 నుండి 11.02 వరకు, మ.3.23 నుండి 4.15 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 8.40 వరకు, సా.5.00 నుండి 5.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారస్తులకు రుణాలు సకాలంలో అందుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలం. రిజిస్ట్రేషన్లు, ఎదుటివారిని సహాయం అడిగే విషయాలు, ఆర్థిక పరమైన అంశాలు, క్రయవిక్రయాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన పనులపై దృష్టి సారించకపోవడం మంచిది. ఆ తర్వాతి నుంచి ఆలోచనా విధానం మారుతుంది. కోపం తగ్గుతుంది. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అనుకూలం. ముఖ్యమైన పనులను ఆలోగా పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం తర్వాతి నుంచి పనుల్లో జాప్యం పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధించేందుకు, ఆర్థిక పరమైన సర్దుబాట్లకు, స్థిర చరాస్తులపై దృష్టి సారించేందుకు, సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదులకు అన్నివిధాలా అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలం. ఆర్థికపరమైన విషయాల్లో 1 గంట తర్వాత మార్పు వస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. మనసుకి కష్టం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం1.30 వరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాతి నుంచి పనుల్లో జాప్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు తగ్గిపోతుంది. అవమానాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 తర్వాతి నుంచి అనుకూలం. ఉదయమంతా అనవసరమైన ఖర్చులు, తగాదాలున్నా.. మధ్యాహ్నం నుంచి ప్రశాంతంగా ఉంటుంది. తెలియని మార్పు కనిపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అనుకూలం. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులు మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పనుల్లో కదలికలుంటాయి. ఆర్థిక పరమైన వెసులుబాటు ఉంటుంది. మధ్యాహ్నం వరకూ విపరీతమైన ఒత్తిడి, చికాకు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 వరకు అనుకూలం. ఆ తర్వాతి నుంచి శ్రమ పెరుగుతుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంచనాలు తలకిందులవుతాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు. విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story