Sun Dec 22 2024 15:59:42 GMT+0000 (Coordinated Universal Time)
JULY 4 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. సంతకానికి విలువైన
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, సోమవారం
తిథి : బ.పాడ్యమి ప.1.37 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ ప.8.24 వరకు, ఉత్తరాషాఢ తె.5.39 వరకు
వర్జ్యం : మ.3.29 నుండి 4.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.26 నుండి 9.18 వరకు, రా.11.15 నుండి 11.59 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.50 నుండి 12.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఎదుటివారితో జరిపే చర్చలు, న్యాయపరమైన అంశాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ ముఖ్యమైన పనులు చేయకపోవడం మంచిది. ఆ తర్వాతి నుంచి పనులు వేగంగా సాగుతాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆలోచనా విధానం మారుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.45 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ లోగా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం తర్వాతి నుంచి పనులు వాయిదా పడతాయి. అనవసరమైన చికాకులుంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. విలువైన వస్తు, సామాగ్రిని కొనుగోలు చేస్తారు. శత్రబాధలు తగ్గుతాయి. దృష్టిదోషం పెరుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు 1.45 గంటల తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. రోజెలా గడుస్తుందా అన్నట్టుగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాతి నుంచి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ముఖ్యమైన పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా పడొచ్చు లేదా ఏకకాలంలో అన్నిపనులు చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చికాకుగా ఉంటుంది. వృథాఖర్చులు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1.30 వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు, ఆర్థికపరమైన అంశాలు, చర్చలు మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాలి. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. సంతకానికి విలువైన ఉద్యోగాల్లో ఉన్నవారు, క్యాష్ కౌంటర్లలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం నుంచి మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాతి నుంచి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అనుకున్నదొకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. శుభవార్తలు విన్నా ఆనందంగా ఉండలేరు. మిమ్మల్ని అందరూ ఉపయోగించుకుంటున్నారన్న ధోరణిలో ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలం. అప్పటి వరకూ జరిగే అంశాలు చికాకుగా ఉంటాయి. ఆతర్వాతి నుంచి దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. వ్యాపారస్తులకు కలసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంతా జాగ్రత్తగా ఉండాలి. వస్తాయనుకున్న లాభాలు ఆగిపోతాయి. అన్నీ హఠాత్మరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆనందంగా ఉన్నారనుకునేలోపే కన్నీరు పలకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు, ఇంటర్వ్యూలకు, ఉద్యోగ మార్పు కోరే వారికి అనుకూలం. ఇష్టమైన ఆహారం తీసుకుంటారు. విశ్రాంతి పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story