Sat Jan 04 2025 01:36:57 GMT+0000 (Coordinated Universal Time)
సూర్యగ్రహణం : నేడు ఏయే రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదు? ఏయే రాశులపై గ్రహణ ప్రభావం ఉంటుంది?
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం విపరీతమైన ఇబ్బందులను కలుగజేస్తుంది. ఈ రాశిలో ఉన్న..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం, మంగళవారం
తిథి : ఆశ్వీజ అమావాస్య సా.4.18 వరకు
నక్షత్రం : చిత్త మ.2.17 వరకు
వర్జ్యం : రా.7.40 నుండి 9.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.24 నుండి 9.10 వరకు
రా.10.37 నుండి 11.27 వరకు
రాహుకాలం : ఉ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : మ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : లేవు
సూర్యగ్రహణ సమయం : సా.4.59 నుండి సా.6.29 వరకు (హైదరాబాద్)
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులపై సూర్యగ్రహణం ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు. ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగిన ఉన్నత విద్యలను కొనసాగిస్తారు. ఎలాంటి శాంతి పరిహారాలు చేయనక్కర్లేదు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులపై ఈ గ్రహణం అన్ని విధాలా మేలు చేస్తుంది. శత్రుబలం తగ్గుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. కోర్టు కేసుల్లో, వ్యాపారాల్లో అన్ని రకాలుగా ఈ గ్రహణం వల్ల మేలు జరుగుతుంది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం సాధారణ ఫలితాలనిస్తుంది. ధైర్య, సాహసాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక, కుటుంబ విషయాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆర్థిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు.. వారంరోజుల్లోగా మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం చేయించుకోవడం మంచిది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం అన్నివిధాలా యోగిస్తుంది. శక్తి, సామర్థ్యాలు మెరుగవుతాయి. లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. గ్రహణ సమయంలో సూర్య కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం ప్రభావం మధ్యస్థంగా ఉంటుంది. గ్రహణాన్ని అనుసరించి.. ఖర్చులు తగ్గుతాయి. శత్రబలం కొంతమేర తగ్గుతుంది. సంతానంపై దృష్టిసారిస్తారు. పనిభారం తగ్గుతుంది.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం విపరీతమైన ఇబ్బందులను కలుగజేస్తుంది. ఈ రాశిలో ఉన్న స్వాతి నచ్చత్రంలో గ్రహణం ఏర్పడుతుండటంతో.. ఈ రాశిలో జన్మించిన వారు గ్రహణాన్ని చూడకూడదు. సూర్యగ్రహణం ప్రభావంతో ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వృత్తి-ఉద్యోగాల్లో, ఆరోగ్య పరంగా.. ప్రతి విషయాల్లోనూ ఒడిదుడుకులు తప్పవు. ద్వాదశ రాశుల్లోకెల్లా గ్రహణం కారణంగా అధికంగా ప్రభావితమయ్యే రాశి తులారాశి. గ్రహణం విడిచిన తర్వాత.. లేదా రానున్న వారంరోజుల్లోగా గ్రహణ దానాలు అనగా.. 1.1/4 గోధుమలు, 1.1/4 ఉలవలను, తెల్లటి పంచల చాపను బ్రాహ్మణుడికి దానం ఇచ్చి.. రుద్రాభిషేకం చేయించుకోవాలి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ప్రతివిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి గుర్తింపు ఉండదు. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. గ్రహణం విడిచిన తర్వాత లేదా.. వారంరోజుల్లోగా రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం అన్ని విధాలా సహకరిస్తోంది. ఈ రాశి వారికి గ్రహణం కారణంగా కీడు జరగదు. వృత్తి-ఉద్యోగాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. గ్రహణాన్ని చూడవచ్చు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం మేలు చేస్తుంది. ఎవరూ మిమ్మల్ని అంచనా వేయలేరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం వల్ల మేలు ఉండదు.. కీడు ఉండదు. గ్రహణాన్ని చూడవచ్చు. గ్రహణ నిమిత్తం ఎలాంటి దానాలు, శాంతులు చేయనక్కర్లేదు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ గ్రహణం పూర్తిగా వ్యతిరేక ఫలితాలనిస్తుంది. శత్రబలం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రమాదాలు జరగవచ్చు. రానున్న వారంరోజుల్లో.. 1.1/4 గోధుమలు, 1.1/4 ఉలవలను, తెల్లటి పంచల చాపను బ్రాహ్మణుడికి దానం ఇచ్చి.. రుద్రాభిషేకం చేయించుకోవాలి.
Next Story