Wed Jan 01 2025 05:42:54 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 4 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం తర్వాతి నుండి అనుకూలంగా ఉంది. రిస్క్ తీసుకోకపోవడం మంచిది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్రవారం
తిథి : శు.ఏకాదశి సా.6.08 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర సా.6.20 వరకు
వర్జ్యం : ఉ.7.03 నుండి 8.36 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.26 నుండి 9.12 వరకు, రా.12.14 నుండి 12.59 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.30 నుండి 2.15 వరకు, సా.5.20 నుండి 6.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. చర్చలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి-ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనుల్లో ఇబ్బంది పడుతారు. ఆచితూచి మాట్లాడాలి. ఎదుటివారు మంచి చెప్పినా అపార్థం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఉన్నవారితో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. ఆర్థికవిషయాలకు అనుకూలం. వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం తర్వాతి నుండి అనుకూలంగా ఉంది. రిస్క్ తీసుకోకపోవడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు ఎక్కువవుతాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. వ్యాపారస్తులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన, ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. పెట్టుబడులపై ఆలోచనలు చేయకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఇంట్లో ఉండేవారితో తగాదాలు, మనస్పర్థలు ఏర్పడుతాయి. శుభవార్తలు వింటారు. విదేశీయాన ప్రయాణ ప్రయత్నాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రాత్రి సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. మనసుకు నచ్చే కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story