Mon Jan 06 2025 05:07:28 GMT+0000 (Coordinated Universal Time)
నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
దుర్ముహూర్తం : మ.12.18 నుండి 1.05 వరకు, మ.2.39 నుండి 3.26 వరకు, రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం : ఉ.10.30 నుండి..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.పాడ్యమి రా1.38 వరకు
నక్షత్రం : రేవతి సా.4.02 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మ.12.18 నుండి 1.05 వరకు
మ.2.39 నుండి 3.26 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి మ.12.00 వరకు
శుభ సమయాలు : మ.1.15 నుండి మ.2.10 వరకు
సా.5.15 నుండి సా.6.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకున్నది ఒకటి.. జరిగేది మరొకటిగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది. పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. ఈరోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశీ ప్రయాణాలకు అవాంతరాలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక విషయాల్లో నేర్పుగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లే సూచనలున్నాయి. అప్పులు చేస్తారు. ఎంతకష్టపడిన గుర్తింపు ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వంటి విషయాల్లోకి వెళ్లకపోవడం మంచిది. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు, వృత్తి- ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. చర్చలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. పాత పరిచయాలు బలపడుతాయి. స్థల వివాదాలు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు యోగదాయకంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఆలోచిస్తారు. శత్రుబాధలు అధికమవుతాయి. వివాహాది శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. వాహన యోగం ఉంది. మానసిక ప్రశాంతత అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు తావివ్వొద్దు. రహస్య శత్రువులు పెరుగుతాయి. జరిగిపోయిన సంఘటనల వల్ల ఇబ్బంది పడతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు కానీ.. పనులు వాయిదా పడుతాయి. అపార్థాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి-ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. క్రయవిక్రయాల్లో లాభాలుంటాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో నష్టాలుండొచ్చు. విద్యార్థినీ విద్యార్థులకు సాధారణంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. తగాదాల నుంచి బయటపడుతారు. చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story