Sat Dec 21 2024 14:39:49 GMT+0000 (Coordinated Universal Time)
నేటి పంచాంగం, ద్వాదశ రాశుల ఫలితాలు
ఏ సమయంలో చేయకూడదు ? ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది ? ఏయే విషయాల్లో..
వ్యాపారం, ఇంటి పనులు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు.. ఇలా కొత్తగా ఏ పని చేయాలన్నా.. ముందు మంచి, చెడులను చూస్తారు. మంచి పని చేయడానికి ఏ సమయం మంచిది ? ఏ సమయంలో చేయకూడదు ? ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది ? ఏయే విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ? అన్న విషయాలను తెలుసుకుందాం.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : శు.చతుర్దశి తె.3.41 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర సా.5.08 వరకు
వర్జ్యం : రా.2.25 నుండి 3.58 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.02 నుండి 7.36 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు, క్రయ విక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. రాజకీయ, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నవారికి ఈరోజు కాలం అనుకూలిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. రుణప్రయత్నాలు ఫలించవు. గతాన్ని తలచుకుని బాధపడతారు. కొనుగోళ్లలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతో విబేధాలు ఉండొచ్చు. విద్యార్థినీ, విద్యార్థులకు కాలం అనుకూలం. భార్య-భర్తల మధ్య తగాదాలు తలెత్తవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాలు సానుకూలంగా ఉంటాయి. శుభవార్త వింటారు. వాయిదా పడిన ప్రయాణాలు ఖరారవుతాయి. విద్యార్థినీ, విద్యార్థులకు కాలం అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు కలిసివస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచిని కూడా చెడుగా చూసే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితిగతులు ఇబ్బందికరంగా ఉంటుంది. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపురంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతాయి. ఇతరులను అంచనా వేయడంలో విఫలమవుతారు. అంచనాలు తారుమారవుతాయి. నిదానమే ప్రధానంగా ముందుకువెళ్లడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య తగాదాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికమవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఊహలు, అపోహలు ఎక్కువవుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఆహార నియమాలు పాటించాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. రుణాలు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలం. రాబడి-ఖర్చు సమానంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య తగాదాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలున్నాయి. రహస్య శత్రువులు పెరుగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story