Sat Dec 21 2024 14:55:48 GMT+0000 (Coordinated Universal Time)
నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
వర్జ్యం : మ.12.15 నుండి 1.52 వరకు, రా.2.14 నుండి 3.54 వరకు, దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.10 వరకు
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.విదియ రా1.29 వరకు
నక్షత్రం : అశ్విని సా.4.17వరకు
వర్జ్యం : మ.12.15 నుండి 1.52 వరకు
రా.2.14 నుండి 3.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.10 వరకు
రా.10.40 నుండి 11.30 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : సా.4.10 నుండి సా.5.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో టెన్షన్లు పెరుగుతాయి. సమస్యలను అధిగమిస్తారు. పనుల్లో ఒత్తిళ్లు తప్పవు. వేళకు నిద్రాహారాలు లేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రయాణాలు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ఒత్తిళ్లు వస్తాయి. ఆశించిన ఫలితాలు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. మనస్పర్థలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భార్య-భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఏమి మాట్లాడినా తప్పుగానే అర్థమవుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు రావొచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు టెన్షన్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. నీలాపనిందలు పడే అవకాశం ఉంది. ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలు కలసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ముదురు రంగులు ధరించకూడదు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బ్యాంక్ రుణాలు కలసివస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు తగాదాలు, వివాదాలతో కొనసాగుతుంది. నిరుత్సాహంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అంచనాలు తారుమారవుతాయి. అపార్థాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆగిన పనుల్లో కదలికలుంటాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తగ్గుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మహిళలకు అనవసరమైన తగాదాలు ఎదురవుతాయి. రెండో పెళ్లి ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story