Mon Dec 23 2024 06:58:04 GMT+0000 (Coordinated Universal Time)
UGADI HOROSCOPE : ఉగాది రాశిఫలాలు.. మేషం నుంచి కన్యారాశి వరకూ ఆదాయ, వ్యయాలు, ఫలితాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో..గడిచిన మూడు సంవత్సరాలకంటే ఈ సంవత్సరం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బుధవారం
తిథి : శు.పాడ్యమి రా.8.20 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర మ.3.32 వరకు
వర్జ్యం : రా.2.50 నుండి 4.21 వరకు
దుర్ముహూర్తం : మ.11.50 నుండి 12.38 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.30 నుంచి 10.20 వరకు
మేషరాశి
ఆదాయం -5
వ్యయం-5
రాజ్యపూజ్యం -3
అవమానం-3
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. జపంలో ఉన్న రాహుదోషం తొలగిపోయి గురుడు ప్రవేశిస్తాడు. ఏకాదశంలో శని సంచారం నడుస్తుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి సాధారణ ఫలితాలుంటాయి. ఉద్యోగ పరంగా ఒత్తిడులు ఉన్నా.. అదేస్థాయిలో ఉన్నతి కూడా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. వ్యవసాయదారులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలుంటాయి. శుభకార్యాలు, ప్రయాణాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు.. అవి ప్రేమ పెళ్లిళ్లైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లైనా, ద్వితీయ వివాహ ప్రయత్నాలు సజావుగా జరుగుతాయి.
సంతానం కలుగుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు చేసే ప్రయత్నాలు నవంబర్ తర్వాత కలసివస్తాయి. గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలు నిరుత్సాహ పరుస్తారు. బరువు పెరగడం లేదా తగ్గడం తరచుగా జరుగుతుంటుంది. ఆరోగ్యనిమయమాలను క్రమం తప్పకుండా పాటించలేరు. చికాకులు పెరుగుతాయి. తగ్గిన అనారోగ్యం మళ్లీ తిరగబెట్టొచ్చు. ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. చికాకులు పెరుగుతాయి.
పరిహారం : ఈ సంవత్సరం ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ఇబ్బందులు ఎదురైనప్పుడు శ్రీశైల దేవస్థానాన్ని దర్శించుకుని రుద్ర, చండీ హోమాలను శక్తి మేరకు చేయించుకోవచ్చు.
వృషభ రాశి
ఆదాయం -14
వ్యయం-11
రాజ్యపూజ్యం -6
అవమానం-1
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో.. సాధారణ ఫలితాలుంటాయి. గురుబలం తక్కువగా ఉంది. శని సంచారం దశమంలో ఉంది. సంవత్సరం ద్వితీయార్థంలో రాహుబలం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమార్పుకు అనుకూలమైన కాలం కాదు. నిరుద్యోగులు చిన్న చిన్న అవకాశాలు వచ్చినా వదులుకోవద్దు. వ్యాపారస్తులకు పోటీ పెరుగుతుంది. చిరువ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యవసాయదారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు పలుకుబడి తగ్గుతుంది.
ఆర్థికంగా.. ఖర్చులు బాగా పెరుగుతాయి. రుణాలు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. అప్పులు ఇవ్వడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. కృత్రిమంగా సంతానం పొందాలన్న ఆలోచనలున్నవారు పునరాలోచించడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. నవంబర్ తర్వాత విదేశీ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యం పరంగా చూస్తే.. తెలియని అనారోగ్యం వేధిస్తుంటుంది. కాళ్లనొప్పులు, అరుగుదల సమస్యలు పెరుగుతాయి. విదేశాల్లో ఇమడలేక ఇబ్బంది పడతారు. రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది.
పరిహారం : ప్రతిరోజూ మూడుసార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయాలి, అలాగే కుక్కకు ప్రతిరోజూ ఏదైనా ఆహారాన్ని పెట్టడం మంచిది. ఇబ్బందులు ఎదురైనప్పుడు తిరుమల శ్రీవారికి మొక్కుకుని సమస్య తీరాక మొక్కును తీర్చుకోవడం మంచిది.
మిథున రాశి
ఆదాయం -2
వ్యయం-11
రాజ్యపూజ్యం -2
అవమానం-4
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో..గడిచిన మూడు సంవత్సరాలకంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అష్టమశని తొలగిపోయింది. గురుబలం పెరిగింది. గతేడాదికంటే ఈ ఏడాది వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. బెటర్ జాబ్ ఆప్షన్లు ఏర్పడుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ రంగాలవారికీ అనుకూలంగా ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. బంగారం కొనుగోలు చేస్తారు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంటుంది. రూపాయి నిలబడదు కానీ.. ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ఉపయోగకరంగా ఉంటుంది.
వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. సంతానాల విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. నవంబర్ లోపు విదేశీ ప్రయత్నాలు కలసివస్తాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. సమస్యలు తీరుతాయి. గౌరవ, మర్యాదలు ఏర్పడుతాయి.
పరిహారం : ప్రతిరోజూ మూడుసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ప్రతి శనివారం ఆంజనేయస్వామి వారికి 108 తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవాలి. ఏదైనా సమస్య తీరట్లేదు అనుకుంటే.. కాణిపాక వినాయకస్వామికి మనసులో నమస్కారం చేసుకుని, ఆ సమస్య తీరాక కాణిపాకం వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోవాలి.
కర్కాటక రాశి
ఆదాయం -11
వ్యయం-8
రాజ్యపూజ్యం -5
అవమానం-4
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో..అష్టమ శని ప్రారంభమవుతుంది. కాబట్టి అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి ఉంటే ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ, లాభాలు తక్కువగా ఉంటాయి. రిస్క్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆర్థిక విషయాలపరంగా చూస్తే.. ఏదొక రకంగా అవసరానికి సర్దుబాట్లు జరుగుతాయి కానీ.. ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తులు కరిగిపోవచ్చు. వైద్యంతో సంతానం పొందాలనుకునేవారికి అనుకూలం కాదు.
విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప.. మంచి ఫలితాలు పొందలేరు. ఎడ్యుకేషన్ లోన్ కూ అనుకూల సమయం కాదు. ఆశించిన ఫలితాలు అందకపోవడంతో నిరుత్సాహపడతారు. ఆరోగ్యరీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. బద్ధకం పెరుగుతుంది. నిద్రలేమి బాధిస్తుంది. చర్మవ్యాధులు, అలర్జీలతో ఇబ్బందులు పడొచ్చు. ఓపిక తగ్గుతుంది. అరుగుదల లోపం రావొచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందడం కష్టమే. ఎవరిమీద ఆధారపడకుండా.. ఎవరి సలహాలు, సూచనలు తీసుకోకుండా.. రిస్క్ కి దూరంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఉండవు.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ప్రతి శనివారం ఆంజనేయస్వామి వారికి 108 ప్రదక్షిణలు చేయాలి. ఏదైనా సమస్య తీరట్లేదు అనుకుంటే.. మందపల్లి శనిదేవునికి మొక్కుకుని, అది తీరాక శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవాలి.
సింహ రాశి
ఆదాయం -14
వ్యయం-2
రాజ్యపూజ్యం -1
అవమానం-7
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో..భాగ్యగురుడి సంచారం కలిసివస్తుంది కానీ.. నవంబర్ నుంచి అష్టమరాహువు దోషం ఆరంభమవుతుంది. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఇష్టంలేని ట్రాన్స్ ఫర్లు ఎదురవుతాయి. వాటికి ఎదురుతిరగడం మంచిది కాదు. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువ. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో..ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అవసరం కోసం ఉన్న ఆస్తుల్ని వాటికున్న విలువ కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితులు రావొచ్చు. రుణాలు చేస్తారు.
ప్రేమల విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంతానయోగం ఉంటుంది. ఏ పనులున్నా అక్టోబర్ లోగా పూర్తిచేసుకోవడం మంచిది. నవంబర్ నుంచి అష్టమరాహు దోషం కారణంగా మానసిక వ్యధ పెరుగుతుంది. మోసపోయేందుకు ఆస్కారం ఎక్కువ. గురుబలంతో వీటన్నింటినీ అధిగమిస్తారు.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ప్రతి శనివారం 108 తమలపాకులతో ఆంజనేయస్వామికి అర్చన చేయించుకోవాలి. ఏదైనా సమస్య తీరట్లేదు అనుకుంటే.. శ్రీశైల దేవస్థానాన్ని దర్శించుకుని రుద్ర, చండీ హోమాలను శక్తి మేరకు చేయించుకోవాలి. అలా చేయించుకోని పక్షంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి.
కన్య రాశి
ఆదాయం -2
వ్యయం-11
రాజ్యపూజ్యం -4
అవమానం-7
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు శోభకృత్ నామ సంవత్సరంలో..ప్రారంభం నుంచే అష్టమ గురుడి దోషం ప్రారంభమవుతుంది. త్వితీయార్థంలో అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. శనిబలం ఉంది కాబట్టి.. ఈ ఏడాది సాధారణంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఏదో తెలియని అసంతృప్తి నెలకొంటుంది. ఏ చిన్న అవకాశం ఉన్నా నిరుద్యోగులు దానిని సద్వినియోగం చేసుకోవాలి. నష్టాలొస్తున్నా.. లాభాలు వస్తాయన్న ధీమాతో వ్యాపారాలు చేయడంతో ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఎక్కువ. బంగారం వంటి విలువైన వస్తువులను తాకట్టుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చేసిన అప్పు ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు. కోర్టుతీర్పులు వ్యతిరేకంగా రావొచ్చు. మానసిక ప్రశాంతత తగ్గొచ్చు. మీ గురించి ముందొక మాట, వెనుక మరోమాట మాట్లాడేవారు పెరుగుతారు. ఆర్థిక స్థితిగతులు బరువుగా పరిణమిస్తాయి. గురు బలం తక్కువగా ఉంది కాబట్టి.. రిస్క్ లేని విషయాల్లో మాత్రమే ముందుకెళ్లడం మంచిది.
పరిహారం : ప్రతి నెలకి ఒకసారి శ్రీగురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రను గురువారం నుండి బుధవారం వరకు పారాయణ చేయాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. గానుగాపూర్ దత్తాత్రేయుని సన్నిధిలో అన్నదానం చేస్తే.. కష్టాలు తీరే అవకాశం ఉంది.
Next Story