Mon Dec 23 2024 15:55:21 GMT+0000 (Coordinated Universal Time)
Jupitor Transit 2023 : రాశి మారుతున్న గురువు.. ఈ 5 రాశులవారికి అద్భుతమైన ఫలితాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి ఏకాదశ స్థానంలో గురుడు ప్రవేశిస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శనివారం
తిథి : శు.విదియ ఉ.7.49 వరకు
నక్షత్రం : కృత్తిక రా.11.52 వరకు
వర్జ్యం : ఉ.11.10 నుండి 12.48 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.51 నుండి 7.30 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.5.10 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి గురుడు ప్రవేశిస్తుండటంతో మిశ్రమ ఫలితాలుంటాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఊహించని ఖర్చులుంటాయి. ఉపయోగం లేని, అనవసరమైన దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉత్సాహం లోపిస్తుంది. బంధువులతో వైరం ఏర్పడుతుంది. ఏడాదికాలం పాటు గురుబలం తక్కువగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి గురుడు వ్యయంలో సంచరిస్తాడు. కాబట్టి పదవి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. రహస్య శత్రువులు పెరుగుతారు. ఖర్చులకు తగిన ఆదాయం లేక అప్పులు చేస్తారు. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఏడాదికాలం పాటు గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి ఏకాదశ స్థానంలో గురుడు ప్రవేశిస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా సతమతమవుతున్న వీరికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఉన్నతి లభిస్తుంది. పేరు, ప్రఖ్యాతులు ఏర్పడుతాయి. గుర్తింపు కలుగుతుంది. ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని గడిపేందుకు కావలసిన అవకాశాలు అందివస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. ఆస్తుల్ని కూడబెడతారు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి గురుడు భాగ్యంలో నుండి దశమంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి.. ఏడాదికాలం పాటు అధికంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్నపనికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కోపం బాగా పెరుగుతుంది. బంధువులతో ఎడబాటు ఏర్పడుతుంది. వస్తువులను సమకూర్చుకునేందుకు విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అష్టమంలో నుండి గురుడు భాగ్యంలోకి వెళ్తున్నాడు. అష్టకష్టాలు పడిన వారికి ఇకపై యోగదాయకంగా ఉండబోతోంది. తల్లిదండ్రుల పట్ల ఆపేక్ష పెరుగుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్న ఆలోచనలు బలపడతాయి. ఆర్థిక వనరులను పెంచుకుంటారు. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నష్టాలను పూడ్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తారు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి అష్టమంలోకి గురు సంచారం వస్తోంది. ఏడాదికాలంపాటు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. సహకరించేవారు, అర్థం చేసుకునేవారు నామమాత్రంగా ఉంటారు. నిరాశ, నిస్పృహ పెరుగుతాయి. నా జీవితం ఇంతేనని నిరాశ పడతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. రిస్క్ కు దూరంగా ఉండాలి.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి షష్టమంలో నుంచి సప్తమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. ఏడాది కాలం పాటు అద్భుతంగా ఉండబోతోంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మంచి బహుమతులు అందుకుంటారు. ఉన్నతమైన పదవులను అలంకరిస్తారు. వాహనయోగం ఉంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు అనుకూలమైన కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఇతరుల నుండి రావలసిన డబ్బులను వసూలు చేసే ప్రయత్నాలు కలసివస్తాయి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి గురుడు పంచమంలో నుండి షష్టమంలోకి వెళ్తున్నాడు. జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాపారాల్లో నష్టాలు రాకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు ఉంటాయి. వృథా ఖర్చులు ఉంటాయి. అన్నింటిలో పాల్గొన్నా మనశ్శాంతి పొందలేరు. ప్రతి పనిలో ఎదురుదెబ్బలు తగులుతాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం గురుబలం చాలా తక్కువగా ఉన్నందున పరిహారాలు పాటించడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి అర్థాష్టమ కుజదోషం తొలగిపోయి.. పంచమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. నిండైన, మెండైన గురుబలం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు పొందుతారు. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. సంఘంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. సంతానం కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృషికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఆలోచనా విధానం బాగుంటుంది. మంచి నేర్పుతో, నైపుణ్యంతో ముందుకు వెళ్తారు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి అర్థాష్టమ గురుదోషం ప్రారంభమవుతుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, సాహసోపేత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులకు తగిన ఆదాయం లేక ఇబ్బంది పడతారు. ఆస్తులు కరుగుతాయి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానంలోకి గురుడు వెళ్తుండటంతో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. ఎటువంటి శక్తియుక్తులు ప్రదర్శించినా విజయాన్ని సాధించడం కష్టసాధ్యంగా మారుతుంది. అప్పులకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత బాగా తగ్గుతుంది.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుండి ద్వితీయంలో గురుడి సంచారం కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది. సంతానం కలుగుతుంది. కీర్తి కలుగుతుంది. అన్నిరకాల సౌకర్యాలు అమరుతాయి. నూతన ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు నెరవేరుతాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది.
గురుబలం తక్కువగా ఉన్న మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చిక, మకర, కుంభ రాశుల వారు ప్రతిరోజూ నల్లపసుపుని అరగదీసి నుదిటన తిలకంగా ధరించాలి. అలాగే రెండు రేకులు కుంకుమ పువ్వుని ప్రతిరోజూ ఉదయం ఆహారంగా తీసుకోవాలి. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
Next Story