Sun Dec 22 2024 21:51:40 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 22 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. కాన్ఫిడెంట్ లెవల్స్ పెరుగుతాయి. ఆలోచన విధానంలో
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, ఆదివారం
తిథి : బ.ఏకాదశి సా.6.14 వరకు
నక్షత్రం : శతభిషం తె.4.05 వరకు
వర్జ్యం : మ.12.31 నుండి 2.00 వరకు
దుర్ముహూర్తం : సా.4.39 నుండి 5.29 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.05 నుండి 11.40 వరకు
నవగ్రహ సంచారం
మేషం - రవి, బుధుడు, రాహువు
వృషభం - శుక్రుడు
మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
మీనం, మేషం - గురువు
చంద్రగ్రహ సంచారం
కుంభం, మీనం, మేషం, వృషభం
ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 22 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. ఇంటి సభ్యులతో అంటీ ముట్టనట్టు ఉంటారు. దంపతుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. సేవింగ్స్ చేసే ప్రయత్నాలు ఫలించవు. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే పరగడుపున తులసి ఆకుల్ని నమిలి తినాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నింటిలోనూ విజయాలు సొంతమవుతాయి కానీ.. దానివెనుక ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. తగాదాలు, అప్రశాంతత ఉంటాయి. పనుల్లో పెద్దగా అవాంతరాలు ఉండవు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఎర్రటి పూలతో ఇష్టదైవాన్ని పూజించి, వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. కాన్ఫిడెంట్ లెవల్స్ పెరుగుతాయి. ఆలోచన విధానంలో నూతన, మెరుగైన, అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మొండితనానికి దూరంగా ఉండాలి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజం. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించి, సుబ్రమణ్య అష్టకాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. అందంపై మమకారం పెరుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా జాగ్రత్త పడతారు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం మీరు అనుకున్నది సాధించి తీరాలన్న మొండిపట్టుదలతో వ్యవహరిస్తారు. గతంలో పొదుపు చేసిన ధనం ఈ వారం అక్కరకు వస్తుంది. బంధువులతో వైరం ఏర్పడవచ్చు. మానసిక ఆందోళనలు పెరగవచ్చు. రిస్క్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. వీలైతే ప్రతిరోజూ ఒక్కోగ్రహం వద్ద ఒక్కో దీపాన్ని వెలిగించడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఉపయోగకరమైన ఖర్చులుంటాయి. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో వారే అర్థం చేసుకోపోతే బయటివారు ఎలా అర్థం చేసుకుంటారన్న ఆలోచనలు బలపడతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పెరిగినా నష్టాలుండవు. ప్రయాణాలు మానసిక సంతోషాన్నిస్తాయి. శుభకార్యాలపై దృష్టిసారిస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ అప్పు ఇవ్వడం మంచిది కాదు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నరసింహస్వామిని పూజించాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఏ సమస్య వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. శత్రువులను కనిపెడతారు. క్షమించడం అనే మాట లేకుండా శత్రువులను జయించడం మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలిసి ఉండదు. బంధువులను బాగా దూరంగా ఉంచుతారు. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ వారం మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని యధాశక్తిగా పూజించాలి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. హేళన చేసిన వారిని దూరంగా ఉంచుతారు. శత్రువులను నామరూపాలు లేకుండా చేసేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ స్వార్థం చూసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిద్ర లోపం బాధిస్తుంది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఉద్యోగంపై ఉన్న శ్రద్ధ ఇంటిపై ఉండట్లేదన్న కంప్లైంట్స్ పెరుగుతాయి. కుటుంబ, ఆర్థికపరంగా వచ్చే ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఈ వారం ఆది, సోమ, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని, శివ కవచాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అదృష్టం కలసివస్తుంది. మంచి మాటకారులై ఉంటారు. తగాదాలతో కూడుకుని ఉన్న విషయాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లపై దృష్టిసారిస్తారు. అప్పులను తీర్చాలన్న సంకల్పం పెరుగుతుంది. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీవేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం క్షణం తీరిక లేకుండా గడుపుతారు. నిద్ర తగ్గుతుంది. ఆలోచనలను కార్యరూపం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. వాహన యోగం ఉంది. ప్రేమలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం తొందరపాటు తనానికి దూరంగా ఉంటారు. ఆలోచనలు చేస్తారు. ఏ విషయాన్నైనా స్వయంగా చూడనిదే నిర్థారణకు రావడం మంచిది కాదు. ఈవారం మిశ్రమమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story