Sun Dec 22 2024 21:11:42 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, మే 14 నుండి మే 20 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, ఆదివారం
తిథి : బ.దశమి రా.2.46వరకు
నక్షత్రం : శతభిషం ఉ.10.16 వరకు
వర్జ్యం : సా.4.22 నుండి 5.53 వరకు
దుర్ముహూర్తం : సా.4.53 నుండి 5.45 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.40 వరకు, సా.6.10 నుండి 6.45 వరకు
నవగ్రహ సంచారం
మేషం, వృషభం - రవి
మేషం - బుధుడు, గురువు, రాహువు
మిథునం - శుక్రుడు
కర్కాటకం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
మేషం, వృషభం, కుంభం, మీనం
మే 14 నుండి మే 20 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. అనవసరమైన విషయాలు ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా అనుకున్నది సాధిస్తారు. తరచుగా అనారోగ్య సమస్యలు రావొచ్చు. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. తగాదాలకు దూరంగా ఉంటారు. విహార యాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాల ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని యధాశక్తిగా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. స్థిర, చరాస్తులపై దృష్టిసారిస్తారు. ప్రతి విషయంలో తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని సార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కుటుంబ పరంగా ఏర్పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడేందుకు అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారికి అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాలు మినహా మిగతా వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆహార, విహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేళకు తగిన నిద్రలేక ఇబ్బంది పడతారు. విద్యార్థులకు అనుకూలం. వివాహాది శుభకార్యాలకు అనుకూలం. ఈ వారం ఆది, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులపై దృష్టిసారిస్తారు. ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదన్న ఆలోచనలు బలపడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తప్పదు. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అధిగమించే మార్గాలు ఉంటాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. సహకరించే వర్గం తక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామికి చేయాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. కోపం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు, చర్మవ్యాధులకు ఊరట కలుగుతుంది. విడాకులు, దంపతుల మధ్య తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. నీరసం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. వారమంతా ఒడిదుడుకులుగా ఉంటుంది. కీలక విషయాలను వాయిదా వేయడం మంచిది. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్నీ పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుబలం తగ్గుతుంది. వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చేసిన అప్పులు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వయంకృతాపరాధాలు చోటుచేసుకుంటాయి. చిన్న తప్పులైన పెద్ద ఇబ్బందులు తెస్తాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్వ్యూలు, ఉద్యోగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆస్తి పంపకాలు తగాదాలకు దారితీస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story