Sun Dec 22 2024 21:59:48 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, మే 7 నుండి మే 13 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం కుజుడి బలం తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సహకరించే వర్గం అందుబాటులో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, ఆదివారం
తిథి : బ.విదియ రా.8.12 వరకు
నక్షత్రం : అనురాధ రా.8.18 వరకు
వర్జ్యం : రా.1.37 నుండి 3.09 వరకు
దుర్ముహూర్తం : సా.4.52 నుండి 5.43 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.10.55 నుండి 11.45 వరకు, సా.6.10 నుండి 6.45 వరకు
నవగ్రహ సంచారం
మేషం - రవి, బుధుడు, గురువు, రాహువు
మిథునం - శుక్రుడు, కుజుడు
కర్కాటకం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభ
మే 7 నుండి మే 13 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కుజబలం తగ్గుతుంది. సహకరించే వర్గం తగ్గవచ్చు. ఎలాంటి తప్పు జరిగినా మీరే సర్దుకుపోవాల్సిన స్థితి ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాలు గురువారం లోగా పూర్తి చేసుకోవాలి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే నరసింహస్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనవసరమైన తగాదాలు, వృథా ఖర్చులు తగ్గుతాయి. అన్నదమ్ముల మధ్య మైత్రి బలపడుతుంది. మంచివైపు అడుగులు వేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దృఢమైన సంకల్పాలు తీసుకుంటారు. సేవింగ్స్ పై దృష్టిసారిస్తారు.అప్పులు తీర్చేందుకు చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఎదుటివారికి సహాయపడతారు. ఈ వారం ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని యధాశక్తిగా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఖర్చుల విషయంలో, మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. విడాకులు తలనొప్పిగా మారుతాయి. కాళ్లనొప్పులు, తలనొప్పి వంటివి పెరుగుతాయి. ఇబ్బందుల నుండి బయటపడే దారులుంటాయి. పాతపరిచయాలను దూరంగా ఉంచి కొత్త పరిచయాలవైపు మొగ్గుచూపుతారు. శుభకార్యాలపై దృష్టిపెడతారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని సార్లు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఎవరు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోరు. చేసే పనిలో న్యాయం ఉందా లేదా అనే ఆలోచిస్తారు. ఉద్యోగ మార్పు, అనుభవం లేని వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూలమైన కాలం కాదు. నీటి వాడకం పెరుగుతుంది. కలత నిద్ర ఉంటుంది. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం కుజుడి బలం తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సహకరించే వర్గం అందుబాటులో ఉంటుంది. గౌరవ, మర్యాదలు ఉంటాయి. ఎదుటివారికి మీ వంతుగా మంచి సూచనలు, సలహాలు ఇస్తారు. ఏనాటి పరిచయాలో ఈ వారం ఉపయోగపడుతాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు, తీర్థయాత్రలు సాఫీగా సాగిపోతాయి. ఈ వారం గురు, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కుజ బలం పెరుగుతుంది. అన్నింటా మీదే పై చేయిగా ఉంటుంది. ఆర్థిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత బలపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనవసరమైన టెన్షన్లు ఉంటాయి. ఈ వారం ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ స్వామివారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. అప్పులు తీర్చాలన్న తాపత్రయం ఉంటుంది. దంపతుల మధ్య తెలియని దూరం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల అలసట పెరుగుతుంది. ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా బాధ్యతల్ని నెరవేర్చుకుంటారు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పాత, కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. రాశ్యాధిపతి కుజుడు గురువారం తర్వాత నీఛలోకి ప్రయాణిస్తుండటంతో శ్రమ పెరుగుతుంది. ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇష్టంలేని పనులను కూడా స్వీకరించక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఒక వర్గానికి పూర్తిగా దూరమవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. జరిగేవి చిన్నచిన్న తప్పులే అయినా.. ఎదుటివారు వాటినే భూతద్దంలో చూస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. మానసిక అప్రశాంతత అధికంగా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఇన్నాళ్లుగా అప్రిసియేషన్ కోసం ఆశతో ఎదురుచూసేవారికి నిరాశే ఎదురవుతుంది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. తీరని సమస్యలు, కష్టాలు ఉండవు. ఈ వారం మంగళ, బుధ,శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దంపతుల మధ్య తగాదాలు ఏర్పడితే ఎవరో ఒకరు తగ్గి ఉండాలి. కోర్టుకేసులు, పోలీస్ కంప్లైంట్స్ విషయంలో దుంకుడు తగ్గించుకోవాలి. ఆర్థికంగా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్నీ పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. రకరకాల సమస్యలు తీరుతాయి. గృహప్రవేశాలకు అవకాశాలెక్కువ. ప్రతి విషయంలో ఊరట కలిగే పరిణామాలు అధికం. ఈ వారం ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అప్పు కోరుకున్న వెంటనే పుడుతుంది. మాటకు విలువ ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మంచి స్థితిగతులు ఏర్పడుతాయి. వ్యాపారానికి మంచి పెట్టుబడులు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story