Mon Dec 23 2024 06:24:14 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, ద్వాదశ రాశుల వారఫలాలు, పరిహారాలు
మేషం - రాహువు, వృషభం, మిథునం - కుజుడు, కన్య- బుధుడు, కన్య, తుల - రవి, శుక్రుడు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.షష్ఠి ఉ.7.03 వరకు
నక్షత్రం : ఆరుద్ర తె.2.15 వరకు
వర్జ్యం : ఉ.8.46 నుండి 10.34 వరకు
దుర్ముహూర్తం : సా.4.09 నుండి 4.56 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : మ.12.00 నుండి 1.30 వరకు
ఈ వారం నవగ్రహ సంచారం
మేషం - రాహువు
వృషభం, మిథునం - కుజుడు
కన్య- బుధుడు
కన్య, తుల - రవి, శుక్రుడు
తుల- కేతువు
మకరం - శని వక్రగతిలో
మీనం - గురువు వక్రగతిలో
మిథునం, కర్కాటకం, సింహం - చంద్రగ్రహ సంచారం
అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 22 వరకూ ద్వాదశ రాశుల ఫలితాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. లాభం- నష్టం, ఆదాయం- వ్యయం సమానంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అప్పలివ్వడం మంచిది కాదు. బెటర్ జాబ్స్ ప్రయత్నాలు సాగుతాయి. అవసరం మేరకు ఖర్చులుంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈవారం ఆది, సోమవారాలు కలసివస్తాయి. శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మాటలు ఆచితూచి మాట్లాడాలి. తరచుగా తగాదాలు ఉండొచ్చు. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్ధగా ఉండాలి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు అధికమవుతాయి. బ్యాంక్ రుణాలు పెరుగుతాయి. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితుల విషయంలో అంచనాలు తారుమారవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈవారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాలు మధ్యస్థంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నూతన వాహనం, స్థలం లేదా ఇంటిని కొనుగోలు చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇంటిపోరు తప్పదు. ఈ వారం మంగళ, బుధవారాలు కలసివస్తాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. స్థల క్రయవిక్రయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనుల్లో పురోగతి ఉంటుంది. శత్రువులు గౌరవిస్తారు. వివాహాది శుభకార్యాలకు ఈ వారం అనుకూలం. తొందరపాటు పనికిరాదు. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ధైర్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇష్టంలేని ఉద్యోగం చేయక తప్పదు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక ఒడిదుడుకులను అధిగమిస్తారు. అప్పుల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. ఆర్థిక ప్రయత్నాలు కలసివస్తాయి. తగాదాలకు దూరంగా ఉంటారు. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులకు ఈ వారం అనుకూలంగా లేదు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు కలసి వస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్ర పారాయణ, శివకవచాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గాయాలు అవ్వొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ సలహాలు, సూచనలను ఎవరూ పట్టించుకోరు. ఆర్థిక ఇబ్బందులు లేవు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తప్పవు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఈ వారం శుక్ర, శనివారాలు కలసివస్తాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. వృత్తి- ఉద్యోగాల్లో మంచి మార్పులుంటాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. బ్యాంక్ రుణాలు కలసివస్తాయి. ఆనందంగా గడిపేస్తారు. ఈ వారం ఆది, సోమవారాలు కలసివస్తాయి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలను అందుకుంటారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. రహస్యాల్ని కాపాడుకుంటారు. క్రయ, విక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు కలసివస్తాయి. దశరథకృత శనిస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో అభిప్రాయ భేదాలు రావొచ్చు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శత్రుబలం పెరుగుతుంది. విద్యార్థినీ, విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఈవారం మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రశాంతత లోపిస్తుంది. తగాదాలు- విభేదాలు రావొచ్చు. మాట పట్టింపులు ఉంటాయి. బంధువులతో సఖ్యత తగ్గుతుంది. శుభవార్తలు వింటారు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story