Fri Nov 22 2024 04:38:36 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, జులై 16 నుండి జులై 22 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నుంచి రవి, బుధ, గురు, శుక్ర బలాలు యోగిస్తున్నాయి. తప్పిదాలు జరిగితే..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, ఆషాఢ మాసం, ఆదివారం
తిథి : బ.చతుర్దశి రా.10.09 వరకు
నక్షత్రం : ఆరుద్ర రా.2.39 వరకు
వర్జ్యం : ఉ.9.35 నుండి 11.20 వరకు
దుర్ముహూర్తం : సా.5.07 నుండి 5.58 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : లేవు
నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
మిథునం, కర్కాటకం - రవి
కర్కాటకం - బుధుడు
సింహం - కుజుడు, శుక్రుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
మిథునం, కర్కాటకం, సింహం
జులై 16 నుండి జులై 22 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నుంచి సౌకర్యాలు తగ్గుతాయి. జీవితం అనుకున్నంత గొప్పగా ఉండదు. ఊహించిన ఫలితాలు ఉండవు. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు కానీ.. సేవింగ్స్ కూడా తరిగిపోతుంటాయి. నిరుద్యోగులు చిన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులకు అనుకూలం. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆస్తి తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గౌరవ, మర్యాదలకు లోటుండకూడదు అన్న ఆలోచనలే ఆత్మగౌరవాన్ని నిలబెడతాయి. విద్యార్థులకు అనుకూలం. వాహన మరమ్మతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుతనం పనికిరాదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉన్నా.. ప్రతి విషయంలో సమస్యల్ని అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. వచ్చే యోగాలను జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలి. కంటికి సంబంధించిన ఇబ్బందులు బాధిస్తాయి. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యప్రధానం చేసి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అష్టమశని ప్రభావం పెరుగుతుంది. పూర్తైపోతుంది అనుకున్న పనులు ఆగిపోవడంతో టెన్షన్లు మొదలవుతాయి. అనుకున్నంత లాభం రాకపోవడంతో ఇబ్బంది పడతారు. విసిగించే వారి సంఖ్య పెరుగుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో ఉంటారు. రోజులు అనూహ్యంగా ఉంటాయి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ప్రశాంతంగా ఉంటారు. పనులు పూర్తయినా కాకపోయినా వాటిని పెద్దగా పట్టించుకోరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. సంతానం విషయంలో తుదినిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల విషయాలు చకచకా సాగుతాయి. అధికారులతో మాట పట్టింపులు, ఒత్తిడులు పెరుగుతాయి. శత్రుబలం, దృష్టిదోషం అధికమవుతుంది. కోర్టుకేసులు చికాకు పెడుతుంటాయి. పనులు సాగతీత ధోరణిలో ఉంటాయి. ఆధ్యాత్మికంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శనిస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతో పూజించాలి.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక వెసులుబాటు కష్టతరమవుతుంది. విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. వేళకు నిద్రాహారాలు కొరవడుతాయి. విద్యార్థులకు అనుకూలం. ప్రేమలు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఒదిగి ఉంటే.. తృప్తిగా ఉంటారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నుంచి రవి, బుధ, గురు, శుక్ర బలాలు యోగిస్తున్నాయి. తప్పిదాలు జరిగితే స్వయంకృతాపరాధం తప్ప.. గ్రహదోషం అవ్వదు. స్తిరాస్థి కొనుగోళ్లను మంచి సమయం. వృత్తి, ఉద్యోగాల్లో వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ మార్పులకు యోగదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. అలాగని పట్టిందల్లా బంగారం అని కాదు. ప్రతి విషయంలో అంటీముట్టనట్టు ఉంటారు. శత్రుబలం తగ్గుతుంది. కోర్టుకేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివాష్టోత్తరాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నామమాత్రంగా ఉంటుంది. గడిచిన కాలంతో పోలిస్తే వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలమవుతాయి. పనుల నుంచి తప్పించుకునే వీలుండదు. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలు తగ్గిపోతుంటాయి. సంతానం విషయంలో చింత ఏర్పడుతుంది. విద్యార్థులకు మతిమరుపు శాపమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సంకష్ఠహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమార్పులో పునరాలోచించుకోవడం మంచిది. ముక్కుసూటిగా, మొండిగా వ్యవహరించడంతో మంచిచెడులు రెండూ ఉంటాయి. యుక్తాయుక్త జ్ఞానంతో మెలగుతారు. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా.. శుక్రుడి బలంతో అన్నీ నెట్టుకొస్తారు. పెద్దవాళ్లు చెప్పే మాటలు వినరు. స్కీమ్ లు కట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. పాతబాకీలు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని, శివాస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కొన్ని కేసుల్లో చిక్కులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. ఆడవాళ్లతో తగాదాలు పెరుగుతాయి. పాత అనారోగ్యంలో ఊరట లభించదు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. అందరూ బాగుండి నాకు మాత్రమే కష్టాలొస్తున్నాయి అనే చందంగా పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రశాంతతనిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. ఎదుటివారు మాట్లాడేదంతా విన్నా.. మీకు నచ్చినట్టుగానే నడుచుకుంటారు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఇష్టదైవాన్ని పసుపురంగు పూలతో పూజించాలి.
Next Story