Sun Dec 22 2024 21:41:48 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : నేటి పంచాగం, జూన్ 11 నుండి 17 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో చేసిన అప్పులు తీర్చడం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, ఆదివారం
తిథి : బ.అష్టమి ప.12.08 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర మ.2.34 వరకు
వర్జ్యం : రా.11.53 నుండి 1.26 వరకు
దుర్ముహూర్తం : సా.5.02 నుండి 5.54 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
వృషభం - బుధుడు
వృషభం, మిథునం - రవి
15వ తేదీ సాయంత్రం నుండి వృషభంలో నుండి మిథునంలోకి సూర్యుడి ప్రవేశం
కర్కాటకం - కుజుడు, శుక్రుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
కుంభం, మీనం, మేషం, వృషభం
జూన్ 11 నుండి 17 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. క్రీడలపై ఆసక్తి కనబరుస్తారు. రిజిస్ట్రేషన్లు, అప్పులు తీర్చే ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఎవరినీ నమ్మరు. ఎక్కువగా ఆలోచించరు. వీలైనంతవరకు ప్రశాంతతకే ప్రాధాన్యమిస్తారు. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుచేసైనా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇగో క్లాషెస్ ఇబ్బంది పెడతాయి. స్థిరచరాస్తులు, భూమికొనుగోళ్లు సానుకూలంగా సాగుతాయి. ఎదుటివారి నుంచి సహాయం పొందుతారు. ఈ వారం ఆది,సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో చేసిన అప్పులు తీర్చడం కష్టతరమవుతుంది. కొత్త అప్పులు చేయకతప్పని పరిస్థితి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కంటే బయటే ప్రశాంతంగా ఉంటారు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య తగ్గుతుంది. మాట ఇచ్చినవారు వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. మాటను దాటివేసేవారు ఎక్కువగా ఉంటారు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. బాధ్యతలు బరువుగా పరిణమిస్తాయి. అలర్జీ, తలనొప్పి సమస్యలు బాధిస్తాయి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం శ్రమకు తగిన ఫలితాలుంటాయి. చేసే ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. చిన్న ఇబ్బందొచ్చినా.. మీకు మీరే ధైర్యం చెప్పుకుంటారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు, విందు - వినోద కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలు ఊహాజనితంగా ఉండవు. శత్రుబలాన్ని తగ్గించుకుంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. 16 నుంచి రవి బలం కూడా ఉండటంతో దూకుడుగా వ్యవహరిస్తారు. ఎవరికి తగలాలో వారికి తగిలేలా మాటలు ఉంటాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కళా,సాహిత్య, క్రీడా రంగాల వారికి అనుకూలం. తృప్తి కొంచెం తక్కువగా ఉంటుంది. విశ్రాంతివేళలు తగ్గుతాయి. మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆలోచనా విధానం మారుతుంది. శరీరంలో ఓపిక తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఉత్సాహాన్ని కోల్పోతారు. జీవిత భాగస్వామి విషయంలో చింత ఏర్పడుతుంది. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అయిపోతుందనుకున్న పని పూర్తికాక నిరుత్సాహ పడతారు. వాహనప్రమాదాలు పొంచి ఉన్నాయి. అనారోగ్యం పెరగవచ్చు. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. సహాయం చేస్తానన్నవారే దూరంగా ఉంటారు. ఇంట్లో ఉండేవారే అర్థం చేసుకోవట్లేదన్న వేదన పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా ఒడిదుడుకులుగా కొనసాగుతుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, సేవింగ్స్ కు అనుకూలం. ఆత్మీయులు జ్ఞాపకానికి వస్తారు. స్నేహితులే ఎక్కువగా అర్థం చేసుకుంటారు. పనులు వాయిదా వేసుకుంటారు. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం రోజు గడిచిందా లేదా అన్నట్టుగా వ్యవహరించడమే మంచిది. మంచైనా, చెడైనా అనుకూలం కాదు. అప్పులు ఇవ్వరాదు, తీసుకోరాదు. చేస్తున్న ఉద్యోగం మానకూడదు. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వ ఉద్యోగులు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శరీరం అలసిపోతుంది. నమ్మకస్తుల నుంచి సహాయ, సహకారాలు తగ్గుతాయి. క్షణం తీరిక ఉండదు.. పైసా ఆదాయం ఉండదు. జీవిత భాగస్వామి మాటతీరు, సలహాలు, సూచనలు ఆనందాన్నిస్తాయి. సంతానం పట్ల బాధ్యతలను నెరవేర్చుకుంటారు. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాలేవీ పూర్తికావు. దంపతుల మధ్య తగాదాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కొత్తగా ఆలోచిస్తారు. కొత్తపనులు చేపట్టే ముందు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story