Mon Dec 23 2024 06:30:48 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాంగం, ద్వాదశ రాశుల వారఫలాలు - పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం ఆర్థిక విషయాలు కలసివస్తాయి. నేర్పుగా ఆర్థిక సమస్యలనుంచి బయటపడుతారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, ఆదివారం
తిథి : శు.షష్ఠి తె.3.27 వరకు
నక్షత్రం : మూల ఉ.7.26 వరకు
పూర్వాషాఢ తె.5.48 వరకు
వర్జ్యం : సా.4.22 నుండి 5.52 వరకు
దుర్ముహూర్తం : సా.4.03 నుండి 4.48 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.10 నుండి ఉ.9.10 వరకు
మేష రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఆర్థిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రం, లక్ష్మీ కవచ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం కలసివస్తుంది. ఆర్థిక నిర్ణయాలు యోగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి- ఉద్యోగాల్లో ముందుకెళ్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం గ్రహగతులు కొంతవరకూ అనుకూలిస్తున్నాయి. పెండింగ్ పనుల్లో పురోగతి ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. నీటిమార్పు వల్ల గొంతుసంబంధిత సమస్యలు రావొచ్చు. ఈ వారం ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా మూడుసార్లు పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం ఆర్థిక విషయాలు కలసివస్తాయి. నేర్పుగా ఆర్థిక సమస్యలనుంచి బయటపడుతారు. అధికారులతో ఉన్న స్పర్థలు తొలగిపోతాయి. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం సాధారణ ఫలితాలుంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వయంకృతాపరాదం తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది. అప్పులు తీర్చడానికి యోగదాయకంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం యోగదాయకంగా ఉంటుంది. ఎదుటివారు మీ మాటను గౌరవిస్తారు. బాల్య స్నేహితులతో ఆనందంగా కాలయాపన చేస్తారు. ఉద్యోగ స్థాయి కోసం కొత్త కోర్సులు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు ఆచితూచి చేయాలి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ అర్జునకృత దుర్గాస్తోత్ర పారాయణ చేయాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం రాశ్యాధిపతి శుక్రుడు బలం ఎక్కువగా ఉండటంతో.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిని పూర్తిచేస్తారు. ఖర్చులు విస్తారంగా ఉన్నా.. సర్దుబాట్లు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ వారం అనుకూలించే రోజులు.. ఆది, సోమ, శనివారాలు. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈవారం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా మోసాలు జరగవచ్చు. సాధారణం కంటే భిన్నంగా జీవించాలన్న ఆలోచనలు సరైనవి కావు. ఆస్తుల అమ్మకాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం సానుకూల ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పెట్టుబడులకు యోగదాయకంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈవారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా మూడుసార్లు పారాయణ చేయడం మంచిది.
మకరరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం చంద్రబలం తక్కువగా ఉంది. అధిక జాగ్రత్త అవసరం. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. వాహన యోగం ఉంది. కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. ఈ వారం మంగళ, బుధ, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ దుర్గాఆపదుద్ధారక స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం సానుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్థులపై దృష్టి పెడతారు. పాతపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ, శివకవచ స్తోత్రాలను పారాయణ చేయాలి.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈవారం వృత్తిృ-ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులకు అనుకూలం కాదు. మానసిక ప్రశాంతత కోసం విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి అవసరాలను తీరుస్తారు. ఈ వారం మంగళ, బుధ, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ దుర్గాఆపదుద్ధారక స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
Next Story