Mon Dec 23 2024 06:32:18 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాంగం, నవంబర్ 6 నుండి 12 వరకూ ద్వాదశ రాశుల వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. ఏ పని చేయాలన్నా ఒకటికి..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, ఆదివారం
తిథి : శు.త్రయోదశి సా.4.28 వరకు
నక్షత్రం : రేవతి రా.12.04 వరకు
వర్జ్యం : మ.12.00 నుండి 1.37 వరకు
దుర్ముహూర్తం : సా.4.01 నుండి 4.46 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.30 నుండి ఉ.9.15 వరకు
నవగ్రహ సంచారం
మేషం - రాహువు
మిథునం - వక్రంలో కుజుడు
తుల - రవి, బుధుడు, కేతువు
తుల, వృశ్చికం - శుక్రుడు
మకరం - శని
మీనం - వక్రంలో గురువు
చంద్రగ్రహ సంచారం
మీనం, శేషం, వృషభం, మిథునం
నవంబర్ 6 నుండి 12 వరకూ ద్వాదశ రాశుల వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రయవిక్రయాల్లో ఎక్కువ ఖర్చులు చేశారన్న భావన కలుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నలుగురిలో కలిసి ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఈ వారం సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఓపిక బాగా అవసరమవుతుంది. ఖర్చులతో పాటు తగాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరిమాట వినరు. పనులు సానుకూలంగా సాగవు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. వాహనయోగం ఉంది. ఈ వారం ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్మి కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కొన్ని కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఎవరేమనుకున్నా.. మీ మంచిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకి సాగిపోవాలి. రాజకీయ, కళా రంగాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. కీలకమైన నిర్ణయాలు, మార్పులు, చేర్పులకు అనుకూలమైన సమయం కాదు. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వాహనం, ఇల్లు కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. అభివృద్ధిలో ముందుకి సాగుతాయి. వైద్యుల సలహాలు, సంప్రదింపులు తీసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత తగ్గుతుంది. శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదిత్య హృదయస్తోత్రాన్ని పారాయణ చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులు సలహాలు, సూచనలు ఇస్తారు. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. శివాష్టోత్తరాన్ని పఠించాలి.
కన్యారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. పని ఒత్తిడి ఉంటుంది. అనారోగ్యం సూచనలు ఉన్నాయి. పెళ్లి, ప్రేమల్లో తొందరపాటుతనం పనికిరాదు. ఈ వారి ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. ఏ పని చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థితిగతులకు వెళ్తారు. పాతపరిచయస్తులను కలిసే అవకాశాలున్నాయి. ప్రయాణాలు అసౌకర్యంగా ఉన్నా లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా మంచి ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలసివస్తాయి. ఏ పనినైనా అవలీలగా పూర్తిచేస్తారు. వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. బ్యాంకు రుణాలు అందుతాయి. నూతన ఆలోచనలు ఉపకరిస్తాయి. ఈ వారమంతా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం మంచిది.
ధనస్సురాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. రుణప్రయత్నాలు కలసివస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మకరరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఖర్చులు పెరుగుతాయి. మోసపోయేందుకు అవకాశాలున్నాయి. వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం మంచిది. పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఆదివారం, శనివారం అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉపయోగం లేని పనులు చేసి సమయం వృథా చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. అప్పులు చేస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఈ వారం సోమ, మంగళ, బుధవారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ కాలభైరవాష్టకాన్ని పఠించాలి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలుంటాయి. సపోర్ట్ చేసిన వారే విబేధిస్తారు. గతంలో పొదుపు చేసిన డబ్బు ఉపయోగపడుతుంది. మంచితనం కాపాడుతుంది. ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
Next Story