Tue Apr 22 2025 20:39:03 GMT+0000 (Coordinated Universal Time)
Diwali 2022 : దీపావళి రోజున ఏ సమయంలో తలస్నానం చేయాలి ? లక్ష్మీదేవిని ఏ సమయంలో పూజించాలి ?
సోమవారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే తలకు, ఒంటికి నువ్వులనూనె పట్టించి.. తలస్నానం ఆచరించాలి. దీపావళి రోజున ఇలా..

దీపావళి.. దీపాల పండుగ. ఈ రోజున యావత్ దేశం దీపపు వెలుగుల్లో విరాజిల్లుతుంది. ఈ ఏడాది దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి ? అన్న సందేహం అందరికీ ఉంది. ఇప్పటికే చాలామంది పండితులు, పురోహితులు దీపావళిని 24వ తేదీ సోమవారమే జరుపుకోవాలని సూచించారు. సోమవారం సాయంత్రం 4.15 గంటల నుండి అమావాస్య మొదలవుతుంది. మంగళవారం సూర్య గ్రహణం, సాయంత్రానికి అమావాస్య గడియలు పూర్తవుతున్నాయి. గ్రహణం రోజు పండుగ చేసుకోకూడదని చెబుతున్నారు.
సోమవారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే తలకు, ఒంటికి నువ్వులనూనె పట్టించి.. తలస్నానం ఆచరించాలి. దీపావళి రోజున ఇలా స్నానం చేయడం మేలు. అలాగే అక్టోబర్ 23, ఆదివారం ధన త్రయోదశి. లక్ష్మీదేవి ఫొటో ముందు వెండి, లేదా బంగారాన్ని పెట్టి పూజ చేయడం ఉత్తమం. కొత్తవి కొనే స్తోమత లేని వారు పాత వెండి లేదా బంగారాన్ని ఆవుపాలతో శుభ్రం చేసి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీదేవిని ఉ.7.55 గంటల నుంచి 9.55 గంటలలోపు పూజించాలి. కుదరని పక్షంలో మధ్యాహ్నం 2.07 గంటల నుంచి 3.30 నిమిషాల వ్యవధిలో పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
ధనత్రయోదశి నాడు డబ్బు సంపాదన కోసమే పూజ చేయడం కాదు.. సంపాదించిన దానిలో ఎంతోకొంత మేర దానధర్మాలు చేయడం ఉత్తమం. అలాగే ఈరోజునే ధన్వంతరి జయంతి కూడా. చాలా మంది సత్యనారాయణస్వామి వ్రతం మాదిరిగానే ధన్వంతరి వ్రతం చేస్తారు. ధన్వంతరి వ్రతం చేయడం కుదరని వారు ధన్వంతరిని మనసులో స్మరించుకుని నమస్కారం చేసుకోవడం మంచిది. ధన్వంతరి వ్రతం లేదా పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలతో జీవిస్తారని నమ్మిక.
Next Story