Mon Dec 23 2024 03:16:24 GMT+0000 (Coordinated Universal Time)
ధనత్రయోదశి వెనుక ఉన్న పురాణ గాథ గురించి మీకు తెలుసా ?
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు..
ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు. ధన త్రయోదశిని ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి ? ధన త్రయోదశి విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధనానికి అధిదేవత 'శ్రీ మహాలక్ష్మి'. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన 'కుబేరుడు'. అందుకే.. ధనత్రయోదశినాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుడిని కూడా ఆరాధిస్తారు.
ధన త్రయోదశి పురాణ కథ
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు.. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు ఆమె. దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. వారు జన్మించిన రోజే ధన త్రయోదశిగా జరుపుకుంటాం. ఎంత చదువు చదివినా.. ఎన్ని తెలివితేటలు ఉన్నా.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ఈ పర్వదినాన వెండి లేదా బంగారం లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి పూజిస్తే మంచి ఫలితాలుంటాయని ప్రతీతి.
Next Story