Sun Dec 22 2024 21:54:35 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : దీపావళి అంటే ఏమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయి?
దీపావళి అంటే దీపాల పండగ. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం
దీపావళి అంటే దీపాల పండగ. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. దేశ వ్యాప్తంగా జరుపుకునే పండగ ఇది. పండగల్లో దీపావళి అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి అంటే ఇల్లు మొత్తం అందంగా ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. పగలంతా కొత్త బట్టలు వేసుకుని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఇక వ్యాపార వర్గాలు అయితే ఆరోజు నుంచే తమ వ్యాపార సంవత్సరం మొదలు పెడతారు. దీపావళికి నెల రోజుల ముందు నుంచే మార్కెట్ లో సందడి మొదలవుతుంది. అయితే దేశంలోనే అత్యంత వైభవంగా వెలుగుల పండగను దీపావళిని జరుపుకుని కేరింతలు కొట్టే దీపావళి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉందిద.
అనేక కథలు...
అసలు దీపావళి ఎందుకు జరపుకుంటారన్న దానిపై పురాణాలు అనేక రకాలుగా చెబుతున్నాయి. చెడుపై మంచిని గెలిచినందుకు దీపావళిని జరుపుకుంటారంటారు. అందుకే సంతోషాన్ని తెలుపుతూ బాణాసంచాను రాత్రి వేళ కాలుస్తారు. పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు శ్రీరాముడు పథ్నాలుగేళ్లు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్య చేరుకున్నందుకు దీపావళిని చేసుకుంటారంటారు. ఉత్తర భారత దేశంలో ఈ కథను ఎక్కువగా విశ్వసిస్తారు. దీంతో పాటు అతి క్రూరుడైన రాక్షసుడు నరకాసురిడిన వధించినందుకు కూడా దీపావళి జరుపుకుంటారన్న కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది.
అయోధ్య నుంచి ...
హిరణాక్ష్యుడిని వధించడం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తుతారు. ఆ సమయంలో వరాహ స్వామివల్లన భూదేవి గర్భం దాలుస్తుంది. త్రేతాయుగంలో రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తానని, అనంతరం భూదేవి ప్రసవిస్తుందని విష్ణువు చెబుతారట. అందుకే త్రేతాయుగంలో లక్ష్మీదేవి రాముడిగా అవతరించి రావణ జనకుడికి లభ్యమవ్వడం, జనకుడితో భూదేవి ఒక మాట ఆ సందర్భంలో తీసుకుంటారట. తనకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చేయాలని కోరతారట దీంతో రావణ సంహారం అనంతరం జన్మించిన భూదేవి కుమారుడికి జనకుడు పెంచి పెద్ద చేసి నరకాసురుడిగా నామకరణం చేశారు.
నరకాసురుడి వధతో...
ద్వాపర యుగంలో నరకాసురుడు రాక్షసుడిగా మారి ప్రజలను ఇబ్బంది పెట్టేవారు. మునులను హింసించేవాడు. ఆలయాలన్నింటినీ పూజలు చేయకుండా మూసి వేయించారు. అయితే ఒకానొక నాడు వశిష్ట మహర్షి కామాఖ్యాదేవి పూజకు వెళుతున్న సమయంలో దేవాాలయం తలుపులు నరకాసురుడు మూసి వేయించాడు. దీంతో కోపం వచ్చిన వశిష్టమహర్షి శాపం పెట్టారని, నీ మరణం నీ తల్లి చేతుల్లో ఉందని శపించాడట. దీంతో భయపడిన నరకాసురుడు పూజలు చేసి తనకు దేవతలు, రాక్షసుల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. ఇక తనకు చావులేదని గర్వంతో చెలరేగిన నరకారుసుడిని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భార్య సత్యభామ వధిస్తుంది. ఆమె భూదేవి. శ్రీకృష్ణుడి సతీమణిగా వచ్చి నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ రోజు దీపావళిని జరుపుకుంటారన్నది ప్రతీతి. రాక్షసుడైన నరకాసురుడైన వధించిన రోజున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు ప్రజలు.
Next Story