Sun Dec 22 2024 17:20:50 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : ఇంతకూ దీపావళి ఎప్పుడు? పండితులు ఏమంటున్నారంటే?
ఈసారి దీపావళికి ఏ తేదీన జరుపుకోవాలన్న సందిగ్దత కొనసాగుతూనే ఉంది.
దీపావళి అంటేనే దివ్వెల పండగ. వెలుగు నిచ్చే వేడుక. చీకట్లను పారదోపి జీవితాల్లో వెలుగులు నింపే పండగగా అందరూ భావిస్తారు. హిందువుల పండగలకు ఎప్పుడూ పండితులు ఏదో ఒక కొర్రీలు పెడుతుంటారు. ముహూర్తాల్లో తేడా అంటుంటారు. ఇప్పుడు కాదు అప్పుడు అంటారు. ఉగాది నుంచి సంక్రాంతి వరకూ ఈ అనుమానాలు అందరిలోనూ కల్పిస్తారు. క్యాలెండర్ లో ఉండే పండగకు, పండితులు చెప్పే ముహూర్తాలకు మధ్య తేడా ఉండటంతో కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఎప్పుడూ అంతే. ఇప్పుడు ఏమీ కాదు. ఈసారి దీపావళికి కూడా ఏ తేదీన జరుపుకోవాలన్న సందిగ్దత కొనసాగుతూనే ఉంది.
అక్టోబరు 31న దీవాలి జరుపుకోవడానికి...
క్యాలెండర్ లో అక్టోబర్ 31వ తేదీన దీపావళి అని ఉంది. అందరూ ఆ డేట్ కు ఫిక్స్ అయిపోయారు. ఆరోజు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించారు. అయితే కొందరు పండితులు మాత్రం కాదు.. కాదు.. నవంబరు 1వ తేదీన అంటున్నారు. కలర్ ఫుల్ గా ఉండే దీపావళిలో ఈ అనుమానాలేంట్రా బాబూ అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. 31వ తేదీన జరుపుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. సాధారణంగా ఆశ్యయుజ బహుళ చతుర్ధశిని నరక చరుర్ధశిగా జరుపుకుంటారు. కానీ తిథుల ప్రకారం ఒకటో తేదీన దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
సందిగ్దంలో తేదీలు....
తిథుల్లో తేడా ఇప్పుడు ఏ తేదీ అన్నది సందిగ్దంలో పడింది. శాస్త్ర ప్రకారం, తిథుల ప్రకారం నవంబరు ఒకటో తేదీన దీపావళి పండగను జరుపుకోవాలంటున్నారు. ఆరోజు జరుపుకోవడం మంచిదని సూచిస్తున్నారు. నవంబరు 1వ తేదీన ఆయుష్యాన్ యోగం, స్వాతి నక్షత్రం కలయిక కూడా ఉందని, నవంబరు ఒకటో తేదీన జరుపుకోవడం మంచిదని చెబుతున్నారు. కానీ ఎక్కువ మంది అక్టోబరు 31న జరుపుకోవాలని సూచిస్తున్నారు. అమావాస్య తిథి, ప్రదోషకాలం, శుభసమయం ఉన్న అక్టోబరు 31న జరుపుకోవాలని మరికొందరు పండితులు గట్టిగా చెబుతున్నారు. అప్పుడు జరుపుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. దీపావళి మరి ఏ రోజు జరుపుకుంటారో? రెండు రోజుల్లో టపాసులు కాల్చి తాము పండగ చేసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Next Story