Tue Nov 05 2024 16:29:34 GMT+0000 (Coordinated Universal Time)
Indrakiladri : నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమాత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు దుర్గమ్మ అన్నపూర్ణదేవి అలంకారంలో కనిపించనుంది.
ఇంద్రకీలాద్రిపై నేడు దుర్గమ్మ అన్నపూర్ణదేవి అలంకారంలో కనిపించనుంది. అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుండటంతో ఉదయం నుంచే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తులు బారులు తీరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. నేడు మూడవరోజు. ప్రజలందరికీ కడుపు నిండా అన్నం దొరికే విధంగా అన్నపూర్ణదేవి ఆశీర్వదించాలని భక్తులు కోరుకుంటున్నారు.
క్యూ కట్టిన భక్తులు...
అన్నం పరబ్రహ్మం స్వరూపం అని భావించడంతో ఈ రూపంలో అమ్మవారిని భక్తితో కొలుస్తారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రిపై తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. పోలీసులు కూడా క్యూ లైన్ లో ఉన్న భక్తులను క్రమపద్ధతిలో పంపుతున్నారు. అంతరాలయం దర్శనం నిలిపివేయడంతో వేగంగానే దర్శనమవుతుందని భక్తులు చెబుతున్నారు. వీఐపీల తాకిడి కూడా తక్కువగానే ఉండటంతో ఉదయాన్నే గంట నుంచి రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందని చెబుతున్నారు.
Next Story