Fri Mar 14 2025 11:54:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దుర్గాష్టమి.. దుర్గాదేవిగా కనకదుర్గమ్మ, మహాగౌరిగా భ్రమరాంబ
వేకువజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం బారులు తీరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు..

ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం బారులు తీరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
శరన్నవరాత్రుల్లో 8వ రోజును దుర్గాష్టమిగా జరుపుకుంటాం. నేడు కనకదుర్గ తల్లి ఎరుపు రంగు చీరను ధరించి, దుర్గాదేవి అలంకారంలో కనిపిస్తారు. నైవేద్యంగా కదంబం, శాకాన్నం సమర్పిస్తారు.
శ్రీశైలంలో..
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో నవరాత్రి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 8వ రోజు.. అనగా నేడు భ్రమరాంబిక అమ్మవారు మహాగౌరి గా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారికి నందివాహన సేవ నిర్వహిస్తారు.
Next Story