Mon Dec 23 2024 06:57:01 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా
నేటి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు
నేటి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు. ఈరోజు తెల్లవారు జాము ుంచే అమ్మవారికి స్వపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. ప్రత్యేక అలంకరణ చేయడంతో అమ్మవారు ధగధగ మెరసి పోతున్నారు. ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉదయాన్నే కొండకు చేరుకున్నారు.
తొలిరోజున ఇంద్రకీలాద్రిపై...
క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ ఉత్సవాల్లో తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని దర్శిస్తే తాము కోరుకున్న ఫలితాలు అన్నీ దక్కుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే క్యూ కట్టారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో దర్శనం కోసం కూడా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వీఐపీ వాహనాలు మినహా ప్రయివేటు వాహనాలను ఇంద్రకీలాద్రి పైకి ఈరోజు నుంచి అనుమతించరని చెప్పారు.
Next Story