బాహుబలి……కాలకేయులు ?
సినిమాల ప్రభావం రాజకీయాల మీద చాలానే ఉన్నట్లుంది. లేకపోతే బాహుబలి సినిమా తీసిన రాజమౌళి చాలా సైలెంట్ గా కొత్త సినిమా చేసుకుంటున్నారు. కానీ రాజకీయ జీవులు [more]
సినిమాల ప్రభావం రాజకీయాల మీద చాలానే ఉన్నట్లుంది. లేకపోతే బాహుబలి సినిమా తీసిన రాజమౌళి చాలా సైలెంట్ గా కొత్త సినిమా చేసుకుంటున్నారు. కానీ రాజకీయ జీవులు [more]
సినిమాల ప్రభావం రాజకీయాల మీద చాలానే ఉన్నట్లుంది. లేకపోతే బాహుబలి సినిమా తీసిన రాజమౌళి చాలా సైలెంట్ గా కొత్త సినిమా చేసుకుంటున్నారు. కానీ రాజకీయ జీవులు మాత్రం బాహుబలి బ్రాండ్ కోసం కొట్టుకుంటున్నారు. జగన్ సర్కార్లో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను కాలకేయులతో టీడీపీ భావి వారసుడు లోకేష్ పోల్చితే అసలైన కాలకేయుడు చంద్రబాబేనని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. అలాగే రాజకీయ బాహుబలి తమ హీరో వైఎస్ జగన్ అని గొప్పగా చెబుతున్నారు. జనాలు హీరోకే పట్టం కడతారని, ఓడిన వాళ్ళు విలన్లేనని కూడా సరికొత్త నిర్వచనం చెబుతున్నారు.
అచ్చెన్న బాహుబలి….
అసెంబ్లీలో అచ్చెన్న బాహుబలి అంటున్నారు లోకేష్. అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శిస్తూ ఆయన్ని ఆకాశానికెత్తేశారు. జగన్ సహా కాలకేయుల సామ్రాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న వీరుడు, శూరుడు అంటూ అచ్చెన్న మీద రెచ్చి మరీ పొగడ్తలు కురిపించారు. ఈ జోరులో తాను కానీ, తన తండ్రి కానీ బాహుబలి సాటి కామని చెప్పేసుకున్నారు. సరే అచ్చెన్న బాహుబలి అయితే జగన్ విలన్ అవుతారన్నది లోకేష్ మార్క్ అర్ధమన్నమాట. దీన్నే ఇపుడు వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. బాహుబలి అంటే మా జగనే అంటున్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మీదంతా కాలకేయుల వారసత్వం. మీ సంగతి తెలిసే జనం కర్రు వాల్చి వాత పెట్టారని సెటైర్లు వేశారు.
విలన్లేనా…?
ప్రజస్వామ్యంలో గెలిచిన వారు హీరోలైతే ఓడిన వారు విలన్లేనా. అలా అయితే ఎపుడు గెలిచి అధికారంలోకి రాని కామ్రేడ్స్ ప్రజల పాలిట విలన్లా అన్న చర్చ వస్తోంది. నిజానికి ప్రజలకు మేలు చేసేవారంతా హీరోలే. ఇక ప్రజాస్వామ్యం అంటేనే ఆప్షన్ తీసుకోవడం. ఒక్కోసారి ఒకటికి మించి ఆప్షన్లు ఉన్నప్పుడు జనం కూడా తడవకొకరికి అన్నట్లుగా అవకాశం ఇచ్చి అందలం ఎక్కిస్తారు. అంతమాత్రం చేత ఓడిన వారు విలన్లు కారు. ఏ ఆప్షన్ లేక కాంగ్రెస్ ఒకనాడు ఇదే ఏపీలో మూడున్నర దశాబ్దాలు ఏలింది, ఇపుడు పూర్తిగా కనుమరుగు అయింది. మరి దీన్ని ఏమంటారో.
సినిమా కాదుగా…?
ఇది జీవితం, నూటికి తొంబై శాతం పేదలు, మధ్యతరగతి వారు సరిగ్గా బతకలేకపోతున్న సమాజం. అటువంటి సమాజ స్థితిని పెంచాలని నాయకులు అనుకోవాలి. ఆ దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయాలి. ప్రజా సమస్యల మీద అంతా ఒక్కటి కావాలి. కానీ ఏపీ రాజకీయం చూస్తూంటే హీరో విలన్ పోరాటంగా మార్చేశారు. అధికార విపక్షాల మధ్య సఖ్యత లేకపోగా ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటున్నారు. సినిమాటిక్ పాలిటిక్స్ చేస్తూ విలన్ ఉండరాదన్నట్లుగా ప్రవరిస్తున్నారు. ఇది మంచిది కాదు, సిద్ధాంతాల మీద రాజకీయాలు ఉండాలి తప్ప సినిమా దర్శకులు తీసే కాల్పనిక చలన చిత్రాల కధలే ముడి సరకుగా రాజకీయం చేయాలనుకుంటే అది రొచ్చు పడుతుంది. జనాలకు రోత పడుతుంది. అన్ని పక్షాలు ఇది గుర్తించడం మంచిది.