మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరిక ఫిక్స్..!
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల్లో వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చేరికల [more]
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల్లో వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చేరికల [more]
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల్లో వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చేరికల సందడి కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలోకి మాజీ కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరిక ఇప్పటికే ఖాయమైంది. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ లోనూ చేరికలు జోరుగా సాగాయి. రోజుకొకరు చోప్పున వరుసగా నేతలను చేర్చుకున్న జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉండటంతో చేరికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇక, ఈ నెల 26వ తేదీన లండన్ నుంచి జగన్ తిరిగి వచ్చాక మళ్లీ చేరికలు ఉండనున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరగా మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
తోట చేరిక ఖాయం..?
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితో మొదలు అవంతి శ్రీనివాసరావు, ఆమంచి కృష్ణమోహన్, పండుల రవీంద్రబాబు, దాసరి జైరమేశ్ వంటి వారు వరుసగా వైసీపీలో చేరారు. తాజాగా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో చేరేముందు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వెళ్లి తోట త్రిమూర్తులును కలిశారు. అప్పుడే ఆమంచితో పాటు ఆయన కూడా వెళ్లిపోతారని భావించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులుతో మాట్లాడారు. పార్టీని వీడొద్దని నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన పూర్తిగా మెత్తపడలేదు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించలేదు. వైసీపీ నేతలతో టచ్ లో ఉన్న ఆయన జగన్ రాగానే పార్టీలో చేరిపోతారని తెలుస్తోంది. ఆయన రాక పట్ల అదే జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ పిల్ల సుభాష్ చంద్రబోస్ కొంత అసంతృప్తితో ఉన్నా.. ఆయనకు పార్టీ పెద్దలు నచ్చజెపుతున్నారు.
బుజ్జగించడం వృధా అనుకున్న టీడీపీ
ఇక, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పార్టీ మారడం ఇప్పటికే ఖాయమైంది. తెలుగుదేశం పార్టీ పట్ల తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించిన ఆయన ఒక సందర్భంలో జగన్ కే ఓటు వేయాలని పరోక్షంగా చెప్పారు. దీంతో తెలుగుదేశం పెద్దలు కూడా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న ఆయనకు వైసీపీ ఇంకా కచ్చితమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతున్నా అదీ వాస్తవం కాదంటున్నారు. మోదుగులతో టచ్ లో ఉన్న వైసీపీ నేతలు రెండుమూడు రోజుల్లో ఆయనతో చర్చలు ముగించి పార్టీలో చేరేందుకు రూట్ క్లీయర్ చేస్తారని తెలుస్తోంది. లండన్ నుంచి జగన్ తిరిగి రాగానే వీరి చేరికలు ఉండనున్నాయి. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా వైసీపీలో చేరున్నారు.