2జీ.. యమ... క్రేజీ
నేనూ శైలజా సినిమా గుర్తిందిగా..అందులో పాపులర్ సాంగ్ గుర్తుందిగా..ఇట్స్ ఏ క్రేజీ ఏ క్రేజీ ఫీలింగ్ పాట ఎంత హిట్ అయ్యిందో.. అంతే హిట్ అయ్యింది 2 - జీ స్పెక్ట్రమ్ కేసు.. ఔనప్పా! సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (పాటియాలా) కోర్టు చెప్పిన వాస్తవం ఇది. నాటి నిందితులు అయిన కనిమొళి .. రాజా వీరంతా ఇప్పుడు నిర్దోషులు.. నాడు ఏ పాపం ఎరుగని వీరు ఇప్పుడు తవ్వెడు పుణ్యం మూటగట్టుకున్నారు.. పాపం! మధ్యలో బలైంది ఎవరబ్బా! మౌని మన్మోహన్ తప్ప! రాజ్యమా! వర్థిల్లు!! ఎప్పటిలానే తగిన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు కొట్టివేయడమైంది అని న్యాయస్థానం యథావిధి గా చెప్పింది. ఎలానూ సీబీఐ ఓ స్టాండ్ బై డైలాగ్ వేసింది.. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నామని చెప్పింది.దీంతో డీఎంకే నేత స్టాలిన్ స్వీట్లు పంచాడు.. మీడియా సోదరులకు కెమెరా సాక్షిగా పండుగ చేసుకోమన్నాడు. మరి! ఈ ఫలితం ఆర్కే నగర్ పోల్ సీన్ పై పడుతుందో లేదో!!! ష్!! ఆ .. ఒక్కటీ అడగకు!! అని అన్నారెవరో!
కళ్లల్లో ఆనందం...
డీఎంకే బాస్ కరుణానిధి కళ్లజోడు సర్దుకున్నాడు. చలువ కళ్లద్దాల నుంచి లోకాన్ని చూసి చూసి విసిగిపోయాడు కదా! కనుకనే ఈసారి తన బిడ్డలందరినీ పిలిచి మరీ! లోకం ఎలా ఉందో తన పిల్లల కళ్లల్లో మెరిసిపోతున్న వెలుగుచూసి సంబరపడ్డాడు. ఎప్పటిలానే రొంబ సంతోషమప్ప అన్న డైలాగ్ ఒకటి వేసి వీల్ చైర్ లో నుంచి లేవబోయాడు.. ఇంతలోనే నాన్నకు ప్రేమతో గ్యాంగ్ స్టాలిన్ , కనిమొళి, అళగిరి వచ్చి ఆయనను హత్తుకున్నారు.. ఇది భయ్యా ఆనందం అంటే!! ఇది భయ్యా ! గెలుపు అంటే అన్నాడు స్టాలిన్ .. నవ్వాడు అళగిరి.. మురిసిపోయింది కనిమొళి..
పోయింది... అదిరిపోయింది...
సర్!! డైరెక్టర్ శంకర్ వచ్చాడు రోబో-3 తీయమంటారా.. అని అడిగాడు రాజాని.. ఎందుకంటే రోబోకి పెట్టుబడి పెట్టింది రాజా తరఫు మనుషులే కదా! అందుకని వద్దులే కానీ రోబో-2 సినిమా థియేట్రికల్ రైట్స్ మనవే అని చెప్పు అని చెప్పి పంపాడు.. బాగుందిరోయ్ బాగుంది. డీఎంకే బాస్ స్టాలిన్ ఏమన్నారో తెలుసా 'తీర్పు చరిత్రాత్మకం. డీఎంకేను నాశనం చేసేందుకు కేసు పెట్టారు. పార్టీ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టు తీర్పుతో తేటతెల్లమైంది' అని వ్యాఖ్యానించారు. అన్ని స్కామ్‌ల విషయంలో మీడియా ఎంత ఉత్సాహంగా పనిచేసిందో అంతే ఉత్సాహంగా కోర్టు ఇచ్చిన తాజా తీర్పును కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.డియర్ సర్! మీరేం బెంగపడకండి మీడియా ఎప్పటిలానే మీ కోసం రెట్టించిన ఉత్సాహంతో టీఆర్పీల కోసం అయినా పరుగులు తీసి మరి! పని చేస్తుంది.. మై హూనా అన్నాడు డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్.. పోయింది అదిరిపోయింది అన్నారెవరో.. అన్నవారు బహుశా! పైన ఉన్న జయమ్మ కాదు కదా!!