రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడినా?
రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసింది. అయితే అప్పటికే నామినేషన్ల గడువు పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ [more]
రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసింది. అయితే అప్పటికే నామినేషన్ల గడువు పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ [more]
రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసింది. అయితే అప్పటికే నామినేషన్ల గడువు పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియడంతో అనేక మంతి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. దేశ వ్యాప్తంగా 55 స్థానాల్లో రాజ్యసభ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇందులో 37 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఇక 18 స్థానాల్లో మాత్రమే ఎన్నిక జరగాల్సి ఉంది.
ఏకగ్రీవమయిన వారిలో…..
ఏకీగ్రీవంగా ఎన్నికయిన వారిలో అనేక మంద ప్రముఖులున్నారు. వారిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తదితరులు ఉన్నారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధకారులు కూడా ప్రకటించారు. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా ఏడు స్థానాలు ఉన్నాయి.
37 స్థానాలు ఏకగ్రీవం….
ఆ తర్వాత స్థానం తమిళనాడుది. ఇక్కడ ఆరు స్థానాలు ఉండగా ఇందులో మూడు అధికార అన్నాడీఎంకే, మూడు స్థానాలు ప్రతిపక్ష డీఎంకే ఏకగ్రీవం చేసుకుంది. మహరాష్ట్రలో కాంగ్రెస్ నుంచి శివసేన పార్టీలో చేరిన ప్రియాంక చతుర్వేదికి కూడా రాజ్యసభ పదవిని ఆ పార్టీ కేటాయించింది. వీరితో పాటు హర్యానా, ఛత్తీస్ ఘడ్, తెలంగాణలో రెడు సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఒడిశాలో బిజూ జనతాదళ్ కు చెందిన అభ్యర్థులు నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏడు రాష్ట్రాల్లోనే…..
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు సభ్యులు సురేష్ రెడ్డి, కే. కేశవరావు ఏకగ్రీవంా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్ లో ఐదు సథానాలు, అసోంలో మూడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానానికి ఏకగ్రీవమయింది. ఇక ఎన్నిక జరగాల్సింది ఏడు రాష్ట్రాల్లో జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో పదిహేడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికలను ఎప్పుడు జరిపేది తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.