ఆ సర్వేను నమ్మొచ్చా.. ?
తాజాగా ఏపీలో ఒక సర్వే అలజడి రేకెత్తిస్తోంది. ఈ సర్వేలో వైసీపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయని ఉంది. అంతే కాదు ఉత్తరాంధ్రలో ఏకంగా పది సీట్ల దాకా [more]
తాజాగా ఏపీలో ఒక సర్వే అలజడి రేకెత్తిస్తోంది. ఈ సర్వేలో వైసీపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయని ఉంది. అంతే కాదు ఉత్తరాంధ్రలో ఏకంగా పది సీట్ల దాకా [more]
తాజాగా ఏపీలో ఒక సర్వే అలజడి రేకెత్తిస్తోంది. ఈ సర్వేలో వైసీపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయని ఉంది. అంతే కాదు ఉత్తరాంధ్రలో ఏకంగా పది సీట్ల దాకా కచ్చితంగా అధికార పార్టీ ఓడిపోతుంది అంటున్నారు. మరో పది సీట్లతో టఫ్ ఫైట్ ఉందని కూడా చెబుతున్నారు. అంటే మొత్తం ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో కేవలం 14 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని ఈ సర్వే చెబుతోంది. 2019 ఎన్నికల్లో 28 సీట్లు గెలిచిన వైసీపీ రెండేళ్ళు తిరగకముందే 14కి వచ్చేస్తే 2024 నాటికి సింగిల్ డిజిట్ కి వచ్చినా ఆశ్చర్యం లేదు అని ప్రత్యర్ధి వర్గాలు అంటున్నాయి.
డౌట్లు అక్కడే …?
ఈ సర్వేలో చాలా చిత్రాలు ఉన్నాయి. కొన్ని కంచుకోట లాంటి సీట్లలో వైసీపీ ఓడిపోతుందని చెప్పడమే పలు సందేహాలకు కారణం అవుతోంది. విశాఖ జిల్లా పాడేరులో వైసీపీ పరాజయం పాలు అవుతుందని సర్వే అంటోంది. నిజానికి 1999 తరువాత ఇక్కడ టీడీపీ గెలిచింది లేదు. ఇక టీడీపీ ఏర్పాటు అయ్యాక ఈ నలభయ్యేళ్ళలోనూ గెలిచింది కూడా కేవలం మూడు సార్లు మాత్రమే. ఈ రోజుకీ అక్కడ టీడీపీకి పెద్దగా బలం లేదు. మరి అలాంటి సీటు తమ పార్టీ ఓడిపోతుందని సర్వేలో పేర్కోనడం పట్ల వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన అయ్యన్న….
నర్శీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి బలం బాగా తగ్గిపోయింది. ఆయన కుడిభుజం అయిన తమ్ముడు సన్యాసిపాత్రుడు ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆయన సతీమణికి కీలకమైన డీసీసీబీ చైర్ పర్సన్ పదవి లభించింది. మరో వైపు పాతిక వేళ ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ఉన్నారు. తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకుంది. తరాలుగా అయ్యన్న ఫ్యామిలీదే ఆధిపత్యంగా ఉన్న నర్శీపట్నం మునిసిపాలిటీ కూడా వైసీపీ చేతుల్లోనే ఉందిపుడు. ఇక్కడ వైసీపీ ఓడిపోతుంది అన్నది తప్పుడు కధనమే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
దూసుకెళ్తున్నాడుగా …?
విశాఖ జిల్లా పెందుర్తికి యువ ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ఉన్నారు. ఆయన రాజకీయంగా దూకుడు మీద ఉంటారు. కనీసం విపక్షానికి అవకాశం ఇవ్వరు. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాత్రమే పోటీగా ఉన్నారు. ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడు ఇంకా తమ్ముళ్ల విశ్వాస్వం చూరగొనలేదు. టీడీపీలో మరో నేత గండి బాబ్జీ కారణంగా వర్గ పోరు ఉంది. ముప్పయి వేల భారీ మెజారిటీతో అదీప్ రాజు ఇక్కడ నుంచి గెలిచారు. మళ్ళీ తనదే విజయం అని ఆయన అంటున్నారు. ఈ సీటు ఓడిపోతుంది అని చెప్పడం దారుణమే అంటున్నారు. ఇవే కాదు వైసీపీ ఎమ్మెల్యే బలంగా ఉన్న పాయకరావు పేట కూడా వైసీపీకి దక్కదు అంటే ఎక్కడో తేడాగానే ఉంది అంటున్నారు. ఈ సర్వే కాదు కానీ వైసీపీ నేతలు మరింత గట్టిగానే తమ నియోజకవర్గాల మీద ఇపుడు దృష్టి పెడుతున్నారు.