టీడీపీలో అచ్చెన్న పనైపోయిందా ?
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అంటే అంతేగా అంతేగా అనే అనాల్సి వస్తోంది. ఎందుకంటే పేరుకు జాతీయ పార్టీ అయినా కూడా టీడీపీ అస్థిత్వం ఆస్తీ అంతా ఏపీలోనే [more]
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అంటే అంతేగా అంతేగా అనే అనాల్సి వస్తోంది. ఎందుకంటే పేరుకు జాతీయ పార్టీ అయినా కూడా టీడీపీ అస్థిత్వం ఆస్తీ అంతా ఏపీలోనే [more]
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అంటే అంతేగా అంతేగా అనే అనాల్సి వస్తోంది. ఎందుకంటే పేరుకు జాతీయ పార్టీ అయినా కూడా టీడీపీ అస్థిత్వం ఆస్తీ అంతా ఏపీలోనే ఉంది. ఇక చంద్రబాబు, లోకేష్ కూడా ఒక వైపే చూస్తూ ఆంధ్రా రాజకీయాలనే చేస్తున్నారు. తండ్రీ కొడుకులే ఎక్కడైనా సర్దుకుంటున్నారు. ఒక్కోసారి వారిలో వారికే పోటీ వస్తోంది. సాధన దీక్షకు చంద్రబాబు హాజరైతే చినబాబుకు ఏం చేయాలో తెలియలేదు. పక్క వాయిద్యంగా మాత్రం అచ్చెన్నాయుడు కూర్చున్నారు అంతే. ఇక ఏపీలో జిల్లాల పర్యటనకు చంద్రబాబు సిద్ధపడిపోతున్నారు. మరో వైపు చినబాబు కూడా దూకుడు మీద ఉన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్యన అచ్చెన్నాయుడుకు ఏం చేయాలో అసలు పాలుపోవడంలేదట.
జిల్లా పర్యటనలు చేయాలని…
అచ్చెన్నాయుడు పేరుకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అన్నట్లుగానే ఉంది. సాధారణంగా జాతీయ పార్టీల నాయకత్వాలు ఎక్కడో ఢిల్లీలో ఉంటాయి. కాబట్టి రాష్ట్ర పార్టీ నాయకులదే పూర్తి హవా ఉంటుంది. కానీ టీడీపీ చిత్రమైన పార్టీ. తనకు తానుగా జాతీయ పార్టీగా ప్రకటించుకున్న టీడీపీలో అచ్చెన్నాయుడు పొజిషన్ ఏంటి అన్నది ఆయనకే తెలియదు, అర్ధమే కాదు. మరో వైపు చూస్తే తాను ఏపీ ప్రెసిడెంట్ అయితే దూకుడు చేస్తానని , ఏపీ అంతా తిరిగేస్తాను, జగన్ కి పక్కలో బల్లెంగా ఉంటాను అని అచ్చెన్నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే జిల్లాల టూర్లు వేసి ఉద్యమాలు కూడా చేయాలని కూడా ప్లాన్స్ వేశారు.
అంత పెద్ద మనిషి….
కానీ ఇపుడు అచ్చెన్నాయుడు ఎక్కడా కనిపించడంలేదు. ఆఖరుకు ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు కూడా అన్నీ చంద్రబాబు, చినబాబును దాటి రావడం లేదు. మొత్తానికి అదేదో సినిమాలో మాదిరిగా అధినాయకులు ఇద్దరూ మాట్లాడిన దానికి అంతేగా అంతేగా అంటూ పక్క తాళం వేయడానికే ఈ ఆరడుగుల భారీ మనిషి మిగిలిపోయారని అంటున్నారు. ఆ మాటకు వస్తే గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావుది కూడా అదే పరిస్థితి. పైగా అప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో ఆయన చేయడానికి కూడా ఏం నిర్ణయాలు అంటూ లేవు. కళా పూర్తి డమ్మీ అయిపోయారని నాడు పార్టీ వర్గాలే చెప్పుకున్నాయి.
పదవి తీసుకునే ముందే?
అయితే ఇవన్నీ అచ్చెన్నాయుడుకు తెలియనివి కావు.. ఆయన కూడా ఏపీ టీడీపీ పగ్గాలు చేపట్టే ముందు నేరుగా చంద్రబాబుతోనే అనేక విషయాలు చర్చించారు. తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్న కండీషన్ బాబు వద్ద పెట్టడంతో పాటు చినబాబు పెత్తనం ఉండకూడదని కూడా చెప్పారన్న టాక్ పార్టీ వర్గాల్లోనే వినిపించింది. అప్పుడు చంద్రబాబు నీకు పూర్తి స్వేచ్ఛ ఉందనే చెప్పారు. అయితే ఇప్పుడు షరా మామూలే అచ్చెన్నాయుడును పక్కన పెట్టేసి బాబు, చినబాబే ముందు ఉంటున్నారు.