వైసీపీ నేతలను రెచ్చగొడుతున్న అచ్చెన్న ?
రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉంటాయి. సామదానభేద దండోపాయాలు కూడా ఉంటాయి. శత్రువుని ఎదుర్కోవాలంటే ఆ శత్రు శిబిరంలో ఉన్న ప్రత్యర్ధుల మధ్య చీలిక తీసుకురావడం కూడా రాజనీతిలో [more]
రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉంటాయి. సామదానభేద దండోపాయాలు కూడా ఉంటాయి. శత్రువుని ఎదుర్కోవాలంటే ఆ శత్రు శిబిరంలో ఉన్న ప్రత్యర్ధుల మధ్య చీలిక తీసుకురావడం కూడా రాజనీతిలో [more]
రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు ఉంటాయి. సామదానభేద దండోపాయాలు కూడా ఉంటాయి. శత్రువుని ఎదుర్కోవాలంటే ఆ శత్రు శిబిరంలో ఉన్న ప్రత్యర్ధుల మధ్య చీలిక తీసుకురావడం కూడా రాజనీతిలో ఒక భాగమే. ఇపుడు ఏపీలో చంద్రబాబు దాన్ని అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక వైసీపీలో నేతల మధ్య గొడవలు పెట్టడానికి తానూ రెడీ అన్నట్లుగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు దూకుడు చేస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా వైసీపీ నేతల మధ్యన విభేదాలు సృష్టించడానికి చంద్రబాబు మార్క్ స్ట్రాటజీనే అచ్చెన్న కూడా అమలు చేయడం విశేషం.
నాన్ లోకల్ అంటూ….
ఉత్తరాంధ్ర వైసీపీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉంటే వారిని కాదని ఎక్కడ నుంచో వచ్చిన విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించడం అందులో భాగమే. విజయసాయిరెడ్డి నాన్ లోకల్ అని, ఆయనకు ఉత్తరాంధ్రా జిల్లాల వ్యవహారాలు ఎలా తెలుస్తాయి అంటూ అచ్చెన్నాయుడు నిలదీయడాన్ని వైసీపీలో కొత్త చిచ్చు రగిల్చే ప్రయత్నంలో భాగంగానే చూడాలి. ఇప్పటికే వైసీపీలో విజయసాయిరెడ్డి మీద లోలోపల గుస్సా అవుతున్న నేతలు ఉన్నారు. సరిగ్గా వారి మీద గురి చూసి బాణం వేసేలా అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.
ఆయన్ని తట్టుకోలేరా…?
విజయసాయిరెడ్డి చాలా స్పీడ్ గా ఉంటారు. ఆయనకు రాజకీయ మొహమాటాలు లేవు. లోకల్ లీడర్లతో ఆయనకు రాజకీయ లావాదేవీలు అసలు లేవు. దాంతో అక్కడ జగన్ ఏది చెబితే ఇక్కడ అమలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తడం టీడీపీ తమ్ముళ్ల వంతు అవుతోంది. దాంతో విజయసాయిరెడ్డి మీద టీడీపీ బాగా మండిపడుతోంది. ప్రత్యేకించి విశాఖ తమ్ముళ్ళు అయితే ఆయన పేరుని ప్రతీ రోజూ తలవకుండా ఉండలేకపోతున్నారు. విశాఖ భూ కబ్జాల మీద విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యూహాలను రచించి తమ్ముళ్లను చక్కగా ఇరికిస్తున్నారు. ఇపుడు వారి గొంతుక అచ్చెన్నాయుడు గళంలో పలికింది అంటున్నారు.
అసంతృప్తి పెంచాలనే …?
ఇక వైసీపీలో చూసుకుంటే చాలా మంది నేతలు విజయసాయిరెడ్డి పోకడల పట్ల గుర్రు మీద ఉన్నారు. అన్నీ ఆయనే, అంతా ఆయనే అన్నట్లుగా ప్రభుత్వాన్ని, పార్టీని కలిపి నడుపుతున్నారని విమర్శలు ఉన్నాయి. మరి వారి చెవులకు అచ్చెన్నాయుడు మాటలు ఇంపుగానే ఉంటాయి. లోకల్ గా ఉన్న తమను కాదని విజయసాయిరెడ్డిని ముందుకు తీసుకురావడమేంటని కూడా వారిలో బాధ ఉంది. అవే మాటలను అచ్చెన్నాయుడు బయటకు అనడం ద్వారా వారిని విజయసాయిరెడ్డి మీద ఎగదోస్తున్నారనే చెప్పాలి. ఇక విజయసాయిరెడ్డి అడ్డు తొలగించుకుంటే చాలు అన్న ధోరణిలో ఇపుడు టీడీపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే టైం చూసి బాణం వేశారా అన్న చర్చ వస్తోంది. మరి ఎవరెన్ని మాట్లాడినా జగన్ నిర్ణయమే ఫైనల్ కదా. అంతవరకూ విజయసాయిరెడ్డికి ఏ చిక్కూ చికాకూ లేదని అంటున్నారు.