కోర్ట్ చుట్టూ గరుడ పక్షి ప్రదక్షిణం ?
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఇది ఒక సినిమా కోసం సినీ కవి రాసింది. ఇప్పుడు గరుడపురాణం చెప్పే నటుడు శివాజీ కి ఇది అక్షర సత్యం అయ్యింది. [more]
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఇది ఒక సినిమా కోసం సినీ కవి రాసింది. ఇప్పుడు గరుడపురాణం చెప్పే నటుడు శివాజీ కి ఇది అక్షర సత్యం అయ్యింది. [more]
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఇది ఒక సినిమా కోసం సినీ కవి రాసింది. ఇప్పుడు గరుడపురాణం చెప్పే నటుడు శివాజీ కి ఇది అక్షర సత్యం అయ్యింది. టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ తో దోస్తీ పాపానికి, ఆయన చెప్పినట్లు అల్లా చేసినదానికి మెడ చుట్టూ కేసులు బిగుసుకున్నాయి. దాంతో వాటినుంచి బయట పడి అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి గరుడపురాణం శివాజీ చేయని ప్రయత్నం లేదు. ఒక పక్క తెలంగాణ లో కానీ ఆంధ్రా లో కానీ షెల్టర్ దొరకని పరిస్థితి. మరోపక్క అజ్ఞాత జీవితంతో అంధకార బంధురమైన జీవితంతో శివాజీ నరకం చూస్తున్నాడు. దాంతో తాజాగా మరోసారి తనపై కేసులు తీసెయ్యండి మహాప్రభో అంటూ హై కోర్ట్ ను తన న్యాయవాది ద్వారా ఆశ్రయించాడు గరుడ శివాజీ.
పక్కన పెట్టిన కోర్ట్ ….
తనపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పెట్టిన కేసులు ఎత్తేయాలని గరుడపురాణం శివాజీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హై కోర్ట్ విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో టివి 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కి కోర్ట్ ను అభ్యర్ధించి ఉన్నందున శివాజీ అంశం పక్కన పెట్టాలని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఆ కేసు విచారణ ఈనెల 28 కి వాయిదా పడటంతో ఆ తీర్పు వచ్చాకా అభ్యర్ధన పరిశీలించాలని టి సర్కార్ న్యాయవాది కోరడంతో మరోసారి చుక్కెదురైంది గరుడపురాణం శివాజీ కి. అనేక మలుపులు తిరుగుతున్న టివి 9 యాజమాన్య వ్యవహారం, అందులో ఫోర్జరీ బాగోతం. లోగో విక్రయం కేసులు ఒక పక్క నడుస్తుండగా గరుడపురాణం శివాజీకి షేర్లు బదలాయింపు వ్యవహారం ఇందులోనూ ఫోర్జరీ ఆరోపణలు స్నేహితులు ఇద్దరికి కస్టాలు కొని తెచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే మూడు రోజులపాటు పోలీసులముందు రవి ప్రకాష్ విచారణకు హాజరు కాగా గరుడ శివాజీ మాత్రం అజ్ఞాత జీవితంలోనే ఉండటం మరిన్ని విమర్శలకు ఆరోపణలకు తెరతీస్తోంది