ఎవరు మూవీ రివ్యూ
బ్యానర్: పీవీపీ సినిమా నటీనటులు: అడివిశేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఎడిటింగ్ [more]
బ్యానర్: పీవీపీ సినిమా నటీనటులు: అడివిశేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఎడిటింగ్ [more]
బ్యానర్: పీవీపీ సినిమా
నటీనటులు: అడివిశేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్
నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
దర్శకత్వం: వెంకట్ రాంజీ
విలన్ గా చేసినా.. హీరో గా చేసినా అడవి శేష్ స్టైల్ వేరు. బలుపు సినిమాలో రవితేజ కి విలన్ గా నటించిన అడవి శేష్… మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో తెరకెక్కిన దొంగాటలోను నెగెటివ్ షేడ్స్ లో ఆకట్టుకున్నాడు. తర్వాత క్రైమ్ అండ్ థ్రిల్లర్ చిత్రాలతో హీరో గా పాపులర్ కూడా బాగా అయ్యాడు. క్షణం సినిమా లో తన ప్రేమికురాలు మరణం గురించి ఇన్వెస్టిగేషన్ చేసే సాధారణ ప్రేమికుడిగా ఇరగదీసిన శేష్.. గూఢచారి సినిమాలో రా ఆఫీసర్ గా అదరగొట్టాడు. గూఢచారి సినిమా లో అడవి శేష్ సీరియస్ నటనకు ప్రేక్షకులు అబ్బురపడ్డారు. క్షణం, గూఢచారి హిట్స్ తో అడవి శేష్ మళ్లి మరో క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీ నే ఎంచుకున్నాడు. రెజినా హీరోయిన్ గా వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడవిశేష్ ఎవరు సినిమా చేసాడు. ఎవరు సినిమా కూడా మంచి ఇంట్రెస్ట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్ గా టీజర్ అండ్ ట్రైలర్ లో చూపించేసరికి ప్రేక్షకుల్లో ఎవరు సినిమా మీద ఆసక్తి కలిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం.. ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు.. వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. మరి దర్శకుడు వెంకట్ రాంజీ ఎవరు సినిమాతో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? క్షణం, గూఢచారి సినిమాతో హిట్ కొట్టిన అడవి శేష్ మరోసారి ఎవరు తో ఎలాంటి హిట్ అందుకున్నాడు? ప్రస్తుతం ఫామ్ లో లేని రెజినా కి ఎవరు ఎంతవరకు హెల్ప్ చేసింది? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఓ సాప్ట్ వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా).. ఆ కంపెనీ బాస్‌కి నచ్చడంతో అతనితో పెళ్లికి సిద్ధపడుతుంది. అయితే ఆ బాస్‌తో ఆమెకు శారీరక సంబంధం లేకపోవడంతో.. తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది. కానీ అనుకోకుండా డీఎస్పీ అశోక్ ని సమీరా హత్య చేస్తుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టగా, స్వీయ రక్షణ కోసమే అతన్ని చంపానని చెబుతుందామె. ఈ కేసుని పరిశోధించడానికి అవినీతి అధికారిగా ముద్రపడ్డ పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) రంగంలోకి దిగుతాడు. సమీర నుంచి లంచం కూడా తీసుకుంటాడు. మరోపక్క కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతారు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. విక్రమ్ వాసుదేవ్… రాహుల్ దగ్గర కూడా లంచం తీసుకుంటాడు. అసలు సమీరా మీద నిజంగానే అత్యాచారం జరిగిందా? విక్రమ్ వాసుదేవ్ నిజంగానే కరెప్టెడా? వినయ్ వర్మ ఎందుకు కనబడకుండా పోయాడు?. సమీరా కేసుకి వినయ్ వర్మ కేసుకు ఉన్న లింక్ ఏమిటి? అన్ని తెలియాలంటే ఎవరు సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
అడివిశేష్ అవినీతి పోలీసు అధికారి పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రీ క్లయిమాక్స్ లో అడవి శేష్ నటనలో మరో కోణం కనిపిస్తుంది. కాకపోతే.. అడవి శేష్ డైలాగ్స్ పలికే విధానంపై ఇంగ్లిష్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఫైట్స్, ఫీట్లు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలను టచ్ చేయకుండానే ఈ సినిమాలో అడవి శేష్ హీరోయిజం పండించాడు. ఇక సమీరా పాత్ర రెజినా కు బాగా హెల్ప్ అయ్యే పాత్ర. మంచి పాత్ర పడాలే కాని.. తనలో పూర్తి స్థాయి నటి ఉందని సమీరా పాత్రతో నిరూపించింది రెజీనా. తొలి సీన్లోనే తన పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన రెజీనా.. ఆ ఫ్లో మిస్ కాకుండా సినిమా చివరి వరకూ కంటిన్యూ చేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కవ్వించింది.. ఏడిపించింది.. నవ రసాలను పండించింది. కథంతా రెజినా చుట్టూనే నడుస్తుంది. అశోక్ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. రెజీనాతో రొమాంటిక్ సన్నివేశాల్లో రొమాంటిక్ గాను ఆకట్టుకున్నాడు. నిహాల్ ఈ సినిమాలో క్యాన్సర్ పేషెంట్‌గా అద్భుతంగా నటించాడు. కథలో కీలకమైన రోల్ పోషించాడు. మురళీశర్మ, పవిత్రా లోకేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం.. ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. సీన్ టు సీన్ తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు.. వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లతో కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఇక్కడ దర్శకుడు వెంకట్ రామ్ జీ కూడా ఎవరు చిత్రంతో ఇదే మ్యాజిక్ చేశాడు. ఇక అడివి శేష్ చిత్రాల్లో అతని క్యారెక్టరైజేషన్ కాస్త భిన్నంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి అనవసరమైన హంగామా చేయకుండా సింపుల్‌గా కథలోకి ఎంటర్ అయిపోతుంటాడు. సినిమా మొదలైన మొదటి సీన్ లోనే హత్య జరుగుతుంది. దానితో ఎలాంటి మలుపులు లేకుండా ప్రేక్షకుడు కథలోకి ఇన్వాల్వ్ అవుతాడు. అయితే విక్రమ్ వాసుదేవ్‌గా అడివిశేష్ పరిచయం కావడంతో సినిమా కథ స్పీడందుకుంటుంది. విక్రమ్ వాసుదేవ్ ప్రశ్న, సమీర జవాబుతో సన్నివేశాలు రక్తికడతాయి. ఇంకో ప్రశ్న, మళ్లీ కథలో ట్విస్ట్… ఈలోపు విక్రమ్ తాను పరిశోధించిన మరో కేసు గురించి చెప్పడం మొదలుపెడతాడు. అందులో కూడా ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు. అలా సినిమాలో ఫస్ట్ హాఫ్ లో రెండు కేసులు, వాటిలో ఊహించని మలుపులతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కాకపోతే ఫస్టాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. ప్రేక్షకుల్ని మరింత థ్రిల్ చేయాలనుకున్నట్టున్నాడు దర్శకుడు. దాంతో సెకండ్ హాఫ్ లో మలుపులు మరీ ఎక్కువయ్యాయి. ఇంటర్వెల్ సీన్‌తో కథ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించినా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి. అయితే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోతాయి.
సాంకేతికంగా…
శ్రీచరణ్ పాకాల సంగీతం సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు తాను బెస్ట్ చాయిస్ అనిపించాడు. పాటలు బోర్ కొట్టకుండా కూడా కథలో భాగమయ్యాయి. గూఢచారి సినిమా ని నేపధ్య సంగీతంతో సినిమా ని ఏ రేంజ్ లో అయితే నించో బెట్టాడో.. ఇప్పుడు ఎవరు కి కూడా నేపధ్య సంగీతాన్ని అంత బాగా అమర్చాడు. ఇక సినిమాకి మరో హైలెట్ సినిమాటోగ్రాఫి. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథకు ఎలాంటి ఇంటెన్సిటీ ఉండాలో తన కెమెరాపనితనంతో చూపించాడు వంశీ పచ్చిపులుసు. సినిమా మొత్తంలో ఐదారు లొకేషన్ల కంటే ఎక్కువగా కనిపించవు. ఎడిటర్ అక్కర్లేని సీన్లకు కత్తెరేసి క్రిస్పీగా ఎడిట్ చేశారు. రన్ టైం కూడా చాలా తక్కువ కావడం సినిమా రేసీగా అనిపించింది. పివిపి వారి నిర్మాణ విలువలు కథానుసారంగా ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, అడవి శేష్, రెజినా నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్, ట్విస్ట్స్
మైనస్ పాయింట్స్: సీరియస్ సెటప్, ఓన్లీ మల్టిప్లెక్స్ ఆడియన్స్, కామెడీ, సెకండ్ హాఫ్
రేటింగ్: 3.0/5