మనమే డిక్టేటర్ అనుకుంటే ఎలా?
ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్తపలుకు చూసిన తర్వాత రాష్ట్రాలను శాసించాలనుకుంటున్న దెవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉంటే ఒకలా? వ్యతిరేక సర్కార్ ఉంటే [more]
ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్తపలుకు చూసిన తర్వాత రాష్ట్రాలను శాసించాలనుకుంటున్న దెవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉంటే ఒకలా? వ్యతిరేక సర్కార్ ఉంటే [more]
ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్తపలుకు చూసిన తర్వాత రాష్ట్రాలను శాసించాలనుకుంటున్న దెవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉంటే ఒకలా? వ్యతిరేక సర్కార్ ఉంటే మరోలా? రాధాకృష్ణ రాతలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకు లోపాలు ఏమీ కనపడవు. ఇప్పుడు మాత్రం లోపాలు ఎత్తి చూపితే శాపాలా? అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన వచ్చారో రెండు తెలుగు రాష్ట్రాలకూ తెలియంది కాదు. ఈ స్థాయికి చేరాలంటే కేవలం శక్తి సామర్థ్యాలు మాత్రమే సరిపోతాయా? అన్న సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వాళ్లే ఆ స్థాయికి ఎదగగలరు.
క్రిమినల్ గా పోల్చి….
ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను క్రిమినల్ తో పోల్చడం ఒక పత్రికాధిపతిగా, పాత్రికేయుడిగా రాధాకృష్ణకు సముచితం కాదు. జగన్ మీద కేసులు ఇంకా ప్రూవ్ కాలేదు. అవి మోపబడిన కేసులేనన్నది అందరికీ తెలిసిందే. అయితే రాధాకృష్ణ మాత్రం గత ఆరేళ్లుగా జగన్ ను క్రిమినల్ గానే చిత్రీకరిస్తున్నారు. క్రిమినల్ అని నిర్ణయించాల్సింది నువ్వు కాదు. న్యాయస్థానాలు లేదంటే ప్రజలు. ప్రజలు జగన్ కు మొన్నటి ఎన్నికల్లో విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. దానికి కూడా ఏపీ ప్రజల ఖర్మ అని రాధాకృష్ణ వ్యాఖ్యానించడం ఆయన విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది.
ప్రజల నుంచి వచ్చిన…..
ఏ ప్రజలైనా నమ్మకంతోనే ఓట్లు వేస్తారు. ఆ నమ్మకం పోగొట్టుకుంటే ప్రజలే ఇంటికి పంపుతారు. ఇది రాజకీయాల్లో సహజం. ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు వంటి నేతలకే తప్పలేదు. ఇప్పుడు ఈయన గారి బాధంతా ఎన్నికల కమషనర్ నిమ్మగడ్డను తొలగించడమే కారణంగా స్పష్టంగా కన్పిస్తుంది. నిమ్మగడ్డ ను తొలగించడం కరెక్టా? కదా? అన్నది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అదే సమయంలో ఒక దళితుడిని ఎన్నికల కమిషనర్ గా నియమించడాన్ని తప్పుపట్టే ధైర్యం ఉందా? ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకుల మీద ఆగ్రహానికి కారణం రాధాకృష్ణ బిజినెస్ కు బోల్డంత నష్టం రావడమే.
శాపాలు.. పాపాలు ఎవరివి?
ప్రజల పక్షం అంటూ గొంతు చించుకునే వారు ఒక పక్షాన నిలిచి, ప్రధానంగా ఎన్నికల సమయంలో అల్లరల్లరి చేసే వారికి ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతే వాత పెడతారు. చంద్రబాబు చంకన ఎత్తుకున్నట్లు ఎవరూ నిన్ను ఎత్తుకోరు. నీకెంత భయం లేదంటున్నావో? నీవన్నా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భయమన్నది ఎరుగరు. ఇద్దరూ ప్రజల నుంచి నిఖార్సుగా ఎన్నికయి వచ్చిన వారే. ఆయనలాగా దొడ్డిదారిన రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిదేమో. ఇప్పటికైనా ఆరేళ్లుగా శాపాలు పెడుతూ పాపాలు చేస్తున్నదెవరో ప్రజలకు తెలుసు. ఈయనగారి పోకడ చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఈయన చెప్పుచేతల్లో నడవాలి. అలాగే ఈయన చెప్పిన మాటలను వినాలి. కానీ అది కుదిరేపనేనా?