జోడి మూవీ రివ్యూ
నటీనటులు: ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్, నరేష్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య తదితరులు సినిమాటోగ్రఫర్: విశ్వేశ్వర్ ఎస్వీ సంగీతం: ఫణి కళ్యాణ్ [more]
నటీనటులు: ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్, నరేష్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య తదితరులు సినిమాటోగ్రఫర్: విశ్వేశ్వర్ ఎస్వీ సంగీతం: ఫణి కళ్యాణ్ [more]
నటీనటులు: ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్, నరేష్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య తదితరులు
సినిమాటోగ్రఫర్: విశ్వేశ్వర్ ఎస్వీ
సంగీతం: ఫణి కళ్యాణ్
ఎడిటర్: రవి మండ్ల
నిర్మాతలు: సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
దర్శకత్వం: విశ్వనాధ్ అరిగెల
సాయి కుమార్ వారసుడిగా వెండితెర తెరంగేట్రం చేసిన ఆది సాయి కుమార్ ఇప్పటికి హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. అవుట్ డేటెడ్ కథలతో సినిమాలు చేస్తూ ప్లాప్స్ మీద ప్లాప్స్ కొడుతున్న అది సాయి కుమార్ నిన్నగాక మొన్న బుర్ర కథ సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకున్నాడు. తాజాగా జెర్సీ భామ శ్రద్ద శ్రీనాధ్ తో కలిసి జోడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో చేసిన జోడి సినిమా మీద ఆది సాయికుమార్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఆది మార్కెట్ పరంగా డల్ గా ఉన్నప్పటికీ… జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచిన శ్రద్ద శ్రీనాధ్ హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్. మరి వరస అపజయాలతో ఖంగుతింటున్న ఆది సాయి కుమార్ కి ఈ జోడి సినిమా అయినా హిట్ అందించిందో లేదో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కపిల్(ఆది) ఇతి కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వెర్ ఇంజినీర్. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించే కాంచన మాల( శ్రద్దా శ్రీనాధ్) తో కపిల్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. చాలా త్వరగానే కపిల్.. కాంచన మాల ప్రేమను దక్కించుకోవడం జరుగుతుంది. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకుంటారు. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో కపిల్ తండ్రి కారణంగా కాంచన మాల తండ్రి మరణించాడు అనే విషయం బయటపడుతుంది. అదే వీరి పెళ్ళికి అడ్డవుతుంది. మొదట కపిల్ తో కాంచనలమాల పెళ్ళికి అంగీకరించిన కాంచన మాల పెద్దవాళ్ళు.. కపిల్ తండ్రి ని చూశాక సంబంధం క్యాన్సిల్ చేస్తారు. అసలు కపిల్ తండ్రి వలన కాంచనలమాల తండ్రి చనిపోవడమేమిటి? వారిద్దరి మధ్య ఉన్న గొడవేంటి? కాంచన మాల పెద్దవాళ్ళని ఒప్పించి కపిల్ ఆమె ను ఎలా దక్కించుకున్నాడు? అనేది జోడి మిగతా కథ.
నటీనటుల నటన:
మొదటి సినిమా నుండి ఆది సాయి కుమార్ నటన ఎలా ఉందొ.. ఇప్పటి జోడి లోను అలానే ఉంది. అసలు జోడి సినిమాలో ఆది పాత్ర డిజైన్ చేసిన విధానమే నచ్చదు. కపిల్ పాత్ర చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇక హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ జెర్సిసిన్మాలో ఎమోషనల్ నటనతో కేక పుట్టించింది. కానీ జోడి లో మాత్రం శ్రద్ద కేవలం ఓ అందమైన అమ్మాయిగానే కనిపించింది కానీ.. నటన పరంగా ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ.. ఆమెని కేవలం గ్లామర్ భామగానే చూసారు. కాకపోతే శ్రద్దా శ్రీనాధ్ చాలా అందంగా కనబడింది. ఇక తాగుబోతు, బెట్టింగ్స్ వేసే తండ్రి పాత్రలో నరేష్ నటన బావుంది. వెన్నెల కిషోర్, సత్య కామెడీ తో అక్కడక్కడా నవ్వించారు. గొల్లపూడి మారుతీ రావు లాంటి నటులున్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
విశ్లేషణ:
కథలో కొత్తదనం లేకపోయినా..స్క్రీన్ ప్లే లో కొత్తదనం ఉంటే ప్రేక్షకుడు ఆ సినిమా కి ఇట్టే కనెక్ట్ అవుతాడు.అవుట్ డేటెడ్ కథతో అయినా.. కథనంలో కొత్తదనంతో ప్రేక్షకుడిని కట్టిపడెయ్యిచ్చు. కానీ ఇక్కడ దర్శకుడు ఒక పాత కథను తీసుకుని దానికి కమర్షియల్ హంగులను జోడించి ఆకట్టుకోవడానికి ప్రయిత్నించాడు. అయితే ఫస్ట్ హాఫ్ ని ఆహ్లాదంగా హీరో హీరోయిన్ ప్రేమతో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని పూర్తిగా నిరాశపరిచాడు. సెకండ్ హాఫ్ లో కుటుంబ అనుబంధాల చుట్టూ కథను అల్లాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు కథలో భావోద్వేగాలు పలికించడంలో పూర్తిగా విఫలం చెందాడు. కథను అటు తిప్పి ఎటు తిప్పి చివరకు రుచిలేని కిచిడి చేశాడు. హీరో హీరోయిన్ చాలా సింపుల్ గా ప్రేమలు పడిపోవడం, పెళ్ళికి సిద్దమైపోవడం చాలా సిల్లీగా అనిపిస్తాయి. ప్రేమలో పడడానికి ఓ బలమైన కారణమే ఉండదు. ఇక కుటుంబ కథ కూడా చాలా నిరాశతో కూడుకున్నదిగా ఉంటుంది. ఇక సినిమాలో వెన్నెల, సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ మాత్రం నవ్విస్తాయి. వరుసగా వచ్చే సన్నివేశాలు పదే పదే వస్తూ చూసిన సన్నివేశమే మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక విలనిజం కూడా ఈ చిత్రంలో సరిగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అయితే ప్రేక్షకుడికి పెద్ద నిరాశ కలిగిస్తుంది. చాలా సాదాసీదాగా సాగే జోడి ప్రేక్షకుడికి ఫుల్ బోర్ కొట్టించెయ్యడం ఖాయం. ఫణి కళ్యాణ్ సంగీతం పర్వాలేదనిపించినా.. నేపధ్య సంగీతం కూడా ఓకె గా వుంది. సినిమాటోగ్రఫీ మాత్రం మెచ్చేలా ఉంది. కానీ ఎడిటింగ్ మాత్రం చిరాకు తెప్పించింది. సినిమాలో లేపెయ్యల్సిన సీన్స్ ని యధాతధంగా ఉంచడంతో.. చాలా సన్నివేశాలు బోర్ కొట్టించేస్తాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
రేటింగ్: 1.5/5